వడోదరలో కొనసాగుతున్న సహాయ చర్యలు

వడోదరలో కొనసాగుతున్న సహాయ చర్యలు

కుండపోత వానతో జలమయమైన వడోదరలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. నీట మునిగిన ప్రాంతాల్లోని ప్రజలకు సాయం చేస్తున్నారు NDRF సిబ్బంది. పాలు, ఆహార పొట్లాలను అందించారు. లోతట్టు ప్రాంత ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిన్న వడోదరలో 50 సెంటిమీటర్ల వర్షం కురిసింది. దీంతో నగరమంతా నీటితో నిండిపోయింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. రోడ్లన్ని చెరువులుగా మారిపోయాయి.

5 వేల ఏడు వందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చాని ప్రాంతంలో గోడ కూలి ఐదుగురు కార్మికులు మృతి చెందారు. విమానాశ్రయంలోని నీరు రావడంతో పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. వడోదర మార్గంలో రైళ్లను రద్దు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని సహాయ చర్యలపై అధికారులతో సమీక్షించారు.