ఎండలు దంచికొడుతున్నాయి. ఈ టైంలో శరీరానికి చాలా నీరు అవసరం.. డీహైడ్రేడ్ అవకుండా.. కూల్‌గా.. చల్లదనం ఇచ్చే ఆహార పదార్దాలనుతీసుకోవాలి. అందుకే సమ్మర్ సీజన్ లో ప్రతికూరలో ఉల్లిగడ్డ వేస్తుంటాం. ఇందులో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచుతుంది. ఉల్లిగడ్డ తినడం వల్ల బ్లడ్ ప్రెజర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. క్యాలరీలు తక్కువ. ఉల్లిగడ్డ తినడం వల్ల చలువ చేస్తుంది . అంత మేలు చేసే ఉల్లిగడ్డ పచ్చడి.. ఉల్లి పరాటా తింటే.. లొట్టలేయాల్సిందే.. ఇప్పుడు వాటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. . .!
ఉల్లిగడ్డ పచ్చడి తయారీకి కావల్సినవి
- నూనె - కొద్దిగా
- ఎండుమిర్చి –ఐదు
- చింతపండు - కొద్దిగా
- ఉల్లిగడ్డలు-ఒక కప్పు
- ఇంగువ - చిటికెడు
- ఉప్పు - తగినంత
- టొమాటో -అరకప్పు
- జీడిపప్పు - కొద్దిగా
- బెల్లం- కొద్దిగా
ఉల్లిగడ్డ పచ్చడి తయారీ విధానం
ఉప్పు వేసి మరికాసేపు ఉంచాలి. అన్నీ మగ్గిన తర్వాత జీడిపప్పు వేసి వేగించాలి. కొద్దిగా బెల్లంవేసి నిమిషం తర్వాత స్టవ్ ఆపేయాలి. ఆ మిశ్రమం చల్లారాక మెత్తగా గ్రైండ్ చేయాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోయొచ్చు.
ఇప్పుడు ఇంకో కళాయి పెట్టి నూనె వేడిచేసి ఆవాలు. జీలకర్ర, మినపప్పు, కరివేపాకు వేసి తాలింపు పెడితే ఉల్లిగడ్డ పచ్చడి రెడీ. దీంట్లో జీడిపప్పు బదులు నువ్వులు, పల్లీలు లేదా పుట్నాలు కూడా వాడొచ్చు. ఆనియన్ రవ్వదోశ, మిర్చి బజ్జీ, అన్నంలో కూడా తినొచ్చు.
ఉల్లిగడ్డ పరాట తయారీకి కావల్సినవి
- గోధుమపిండి - రెండు కప్పులు
- ఉప్పు - పావు టీ స్పూన్
- నూనె లేదా నెయ్యి - ఒక టీ స్పూన్
- నీళ్లు - తగినన్ని
- ఉల్లిగడ్డ తరుగు -ఒక కప్పు
- పచ్చిమిర్చి తరుగు - ఒక టీ స్పూన్
- గరం మసాలా - చిటికెడు
- కారం- కొద్దిగా
ఉల్లి గడ్డ పరాట తయారీ విధానం
ఒక గిన్నెలో గోధుమపిండి, నెయ్యి లేదా నూనె పోసి నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలపాలి. దాన్ని 20 నిమిషాలు పక్కనుంచాలి. ఒక గిన్నెలో ఉల్లిగడ్డ తరుగు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, గరంమసాలా వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమంలో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఎంత వీలైతే అంత సన్నగా తరిగితే మంచిది. తర్వాత గోధుమపిండిని కొద్దిగా తీసుకుని కొంచెం వెడల్పుగా వత్తి ఉల్లిగడ్డ మిశ్రమాన్ని పెట్టి నాలుగువైపులా మడవాలి.
తర్వాత పొడిపిండి చల్లుతూ చపాతీలా ఒత్తుకోవాలి. పెనం వేడిచేసి నూనె పూసి పరాటాను అటూ ఇటూ కాలిస్తే ఉల్లిగడ్డ పరాటా రెడీ.
