ఉల్లిపాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..

ఉల్లిపాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..


సాధారణంగా ఉల్లిపాయ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కానీ వేసవిలో ఉల్లిపాయలు తొందరగా కుళ్లిపోవడం, పాడవడం జరుగుతుంటుంది. అందుకే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల పాడవకుండా కాపాడుకోవచ్చు. బంగాళదుంపలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి భారతీయ వంటగదికి జీవనాధారం. ఈ మూడు లేనిదే ఆహారం అసంపూర్ణం అని చెప్పాలి. అయితే ఈ మూడింటిని సరిగ్గా ఉంచుకోకపోతే  కుళ్లిపోతుంటాయి. ఉల్లిపాయలను ఎప్పుడూ పొడి వాతావరణంలో ఉంచాలి. గాలి కూడా ఎక్కువగా వచ్చేలా చూసుకోవాలి. కొన్ని నిల్వ చేసే పద్ధతుల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. 

కుళ్లిపోకుండా ఇలా కాపాడుకోండి

ఉల్లిపాయను కుళ్ళిపోకుండా కాపాడుకోవాలనుకుంటే దానిని చల్లని..పొడి వాతావరణంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయ ఎక్కువ కాలం కుళ్ళిపోదు. బంగాళదుంపలు, ఉల్లిపాయలను వంటగదిలో వెంటిలేషన్ బాగా వచ్చే ప్రదేశంలో ఉంచండి. వేడి, సూర్యకాంతి  రాని ప్రదేశంలో  ఉంచాలి. ఉల్లిపాయలకు తేమ అసలు తగలకూడదు.  అవసరమైతే తప్ప ఉల్లిపాయలను కడగవద్దని నిపుణులు అంటున్నారు.

ఇతర కూరగాయలతో కలపవద్దు

ఉల్లిపాయను పొడి గుడ్డతో తుడిచి ఆపై నిల్వ చేయండి. ఉల్లిపాయలను ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఉంచకుండా వాటిని బుట్టలో నిల్వ చేయాలి. అన్ని వైపుల నుంచి గాలి వచ్చే కంటైనర్‌ను ఉపయోగించండి. ఉల్లిపాయను ఇతర పండ్లు మరియు కూరగాయల నుంచి దూరంగా ఉంచాలని నిపుణులు అంటున్నారు. తడిగా ఉన్న ప్రదేశాల నుంచి దూరంగా ఉంచాలి. లేకపోతే వెంటనే కుళ్లిపోతుందని, ఉల్లిపాయల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మెష్‌లను ఉపయోగించాలని చెబుతున్నారు