99 బిలియన్​​ డాలర్లకు ఆన్​లైన్​ బిజినెస్​!

99 బిలియన్​​ డాలర్లకు ఆన్​లైన్​ బిజినెస్​!

వెలుగు బిజినెస్​ డెస్క్​: మన దేశంలో ఆన్​లైన్​ వ్యాపారం 2024 నాటికి 99 బిలియన్​ డాలర్లకు చేరుతుందని ఒక రిపోర్టు వెల్లడించింది. 2019–24 మధ్య కాలంలో ఈ వ్యాపారం ఏటా 27 శాతం చొప్పున పెరుగుతుందని ఈవై–ఐవీసీఏ ట్రెండ్​ బుక్​ రిపోర్టు పేర్కొంది. గ్రోసరీ (కిరాణా), ఫ్యాషన్​, అపారెల్​ (దుస్తులు) ...ఈ మూడు సెగ్మెంట్స్​ ఆన్​లైన్​ వ్యాపారాలను ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలిపింది.2025 నాటికి మన దేశంలో 220 మిలియన్​ల ఆన్​లైన్​ షాపర్లు ఉంటారని ఈ రిపోర్టు పేర్కొంది. 2019 నాటికి 4.7 శాతంగా ఉన్న రిటెయిల్​ సెగ్మెంట్​ 2024 నాటికి 10.7 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. డిజిటల్​ ఇండియా ప్రోగ్రామ్​ ద్వారా 2025 నాటికి ఒక ట్రిలియన్​ డాలర్​ ఆన్​లైన్​ ఎకానమీ తేవాలని గవర్నమెంట్​ ప్రయత్నిస్తోందని వివరించింది. మొత్తం ఆర్గనైజ్డ్​ మార్కెట్​లో ఆన్​లైన్​ రిటెయిల్​ మార్కెట్​ వాటా దాదాపు 25 శాతం. ఈ రిటెయిల్​ మార్కెట్​ 2030 నాటికి 37 శాతానికి పెరుగుతుందని అంచనా. కొత్తగా వస్తున్న  ఆన్​లైన్​ యూజర్లలో ఎక్కువ మంది టైర్​2, టైర్​ 3 సిటీల నుంచే వస్తున్నారు. దేశీ స్టార్టప్​ కంపెనీలకు ఇదొక వరంగా మారే అవకాశం ఉంది. స్మాల్​, మీడియం బిజినెస్​లు కూడా ఆన్​లైన్​ బాట పడుతున్నాయని, ఈ సెగ్మెంట్​ వల్ల కూడా డిజిటల్​ స్టార్టప్స్​ ఎదుగుదలకు వీలు కల్పిస్తాయని రిపోర్టు వెల్లడించింది.  ఆన్​లైన్​ పేమెంట్స్​, మొబైల్​ చానల్స్​ ఏర్పాటు చేసుకుంటున్న చిన్న వ్యాపారులందరూ టెక్నాలజీ స్టార్టప్స్​తో కలిసి పనిచేసేందుకు చూస్తున్నారని వివరించింది. స్టార్టప్​ ఇండియా, డిజిటల్​ ఇండియా, స్కిల్​ ఇండియా, ఇన్నోవేషన్​ ఫండ్​, భారత్​ నెట్​ వంటి ప్రోగ్రామ్స్​తో ఆఫ్​లైన్​ మార్కెట్​ను ఆన్​లైన్​లోకి తెచ్చేందుకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. 

మలి దశ ఆన్​లైన్​ వ్యాపారంలో టైర్​2, టైర్​ 3 సిటీల నుంచి ఎక్కువ గ్రోత్​ రానుంది. కొత్తగా వచ్చే వందలాది మిలియన్​ల కన్జూమర్లు ఇక్కడ నుంచే రానున్నారు. ఆన్​లైన్​ వ్యాపారంలో కొత్త పెట్టుబడులు భారీగా వస్తున్నాయి.బీటూ బీ, బీ2సీ సెగ్మెంట్స్​ రెండింటిలో పెద్ద గిగ్​ ఎకానమీ రాబోతోంది. 
- కార్తీక్​ రెడ్డి, వైస్​ చైర్మన్​, ఐవీసీఏ