ఐఐటీ మద్రాస్ లో ఆన్ లైన్ డిగ్రీ

V6 Velugu Posted on Jul 04, 2020

దేశంలోనే మొదటిసారిగా ఐఐటీ మద్రాస్ ప్రోగ్రామింగ్ అండ్ డేటా సైన్స్ లో

బీఎస్సీ డిగ్రీ, డిప్లొ మా కోర్సును ప్రారంభించింది. అకడమిక్ బ్యాక్‌‌గ్రౌండ్ తో

సంబంధం లేకుండా పూర్తిగా ఆన్‌‌లైన్ లోనే అందిస్తున్న ఈ కోర్సును ఎవరైనా

ఎక్కడినుం చైనా చదువుకునే అవకాశం కల్పిస్తోంది.

 

        ఇదివరకే ఆన్ న్ లో ప్రొఫెసర్స్ పాఠాలు చెప్పిన ఐఐటీలు ఏకంగా ఆన్ న్ డిగ్రీ ప్రోగ్రాములనే లాంచ్ చేశాయి. ప్రపంచంలోనే మొదటిసారిగా ఐఐటీ మద్రాస్ ప్రోగ్రామింగ్ అండ్ డేటా సైన్స్ లో బీఎస్సీ డిగ్రీ, డిప్లొ మా కోర్సును ప్రారంభించింది. వయసు, ప్రాంతం, అకడమిక్ బ్యాక్ రౌండ్ తో సంబంధం లేకుండా పూర్తిగా ఆన్ లైన్ లోనే అందిస్తున్న ఈ కోర్సును ఎవరైనా ఎక్కడి నుంచైనా చదువుకునే అవకాశం కల్పిస్తోంది ఐఐటీ మద్రాస్.

 

స్మార్ట్ డివైజ్‌ లు పెరిగిపోయి రోజూ క్వింటిల్లియన్ల డేటాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మరి ఆ డేటాను సరైన విధంగా ప్రాసెస్ చేసి ఉపయోగించినప్పుడే దానికి డిమాండ్ ఉంటుంది అంటారు ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ భాస్కర రామమూర్తి. 2001 లోనే ఎన్‌ పీటీఈఎల్ ప్రోగ్రాంను ప్రారంభించిన ఐఐటీఎం 2014 నుంచి ఎన్‌ పీటీఈఎల్ ఆన్‌ లైన్ క్లాసెస్, 2017 లో స్వయం మూక్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసింది. తాజాగా అధిక డిమాండ్ ఉన్న డేటా సైన్స్ కోర్సులో ఆన్‌ లైన్ డిగ్రీని ఆఫర్ చేస్తోంది.

డేటా సైన్స్ అంటే

వివిధ రకాల టూల్స్, అల్గా రిథమ్స్, మెషిన్ లెర్నింగ్ ప్రిన్సిపుల్స్ ఉపయోగించి రా డేటా నుండి అర్థవంతమైన సమాచారాన్ని క్రోడీకరించే టెక్ని కల్ ప్రాసెస్ నే డేటా సైన్స్ అంటారు. అతిపెద్ద సైజ్‌ లో ఉండే రా డేటా లేదా అన్‌ ప్రాసెస్‌‌డ్, అతిపెద్ద, భిన్నమైన, స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్, అన్‌ స్ ట్రక్చర్డ్ డేటాను అనలైజ్ చేసి ఒక కన్‌ క్లూ జన్‌ కు రావడం. పేరులో ఉన్నట్లు గానే వివిధ రూపాల్లో ఉన్నది ఉన్నట్లు వాడుకోలేని అతిపెద్ద సమాచారంను సేకరించడంతో పాటు అనలైజ్, ఆర్గనైజ్ చేసే ప్రక్రియ ఇది. దీని ద్వారా కంపెనీలు, మేనేజ్‌ మెంట్స్ తమ బిజినెస్ కార్యకలాపాల్లో క్వి క్ డెసిషన్స్ తీసుకొని వాటిని అమలు చేయగలవు. ఇందులో స్పెషలైజ్డ్ సాఫ్ట్‌‌వేర్ టూల్స్ ద్వారా ప్రిడిక్టివ్ అనలిటిక్స్, డేటా మైనింగ్, టెక్స్ట్ మైనింగ్, ఫోర్‌‌క్యాస్టింగ్, డేటా ఆప్టిమైజేషన్ ద్వారా డేటా సెట్స్‌‌విశ్లేషణ జరుగుతుంది. ఇందుకుగాను అనలిస్టులు స్టాటిస్టికల్, క్వాంటిటేటివ్, టెక్ని కల్ మెథడ్స్ ఉపయోగిస్తారు. అంటే ఇన్ని రోజులు స్టాటిస్టియన్స్ మాన్యువల్ గా చేసే ఒక ప్రోగ్రామింగ్ ద్వారా కంప్యూటర్ చిటికెలో చేసేస్తుందన్నమాట.

కోర్సు స్ట్రక్చర్

ఈ ప్రోగ్రామ్ మొత్తం పూర్తి చేసి సర్టిఫికెట్ పొందాలంటే విద్యార్థు లు మూడు లెవెల్స్ దాటాల్సి ఉంటుంది. అవి ఫౌండేషన్ లెవెల్, డిప్లొమా లెవెల్ మరియు డిగ్రీ లెవెల్. ఏ దశలోనైనా ఆ లెవెల్ సర్టిఫికెట్ తో విద్యార్థి బయటకు వెళ్లిపోవచ్చు. మూడు లెవెల్స్ లో 31 కోర్సులుం డగా మొత్తం క్రెడిట్స్ 116. కోర్సు పూర్తి చేయడానికి 3 నుంచి 6 సంవత్సరాలు పట్టొచ్చు. ఒక లెవెల్ లో తర్వాతి కోర్సు కు వెళ్లాలంటే ప్రస్తుతం ఉన్న లెవెల్ లోనే అన్ని కోర్సులు పూర్తి చేయాలి. అలాగే ఫౌండేషన్ నుంచి డిప్లొమా , డిప్లొమా నుంచి డిగ్రీ కి వెళ్లాలంటే ఆ లెవెల్స్ పాసవ్వాలి . ఏటా జనవరి, మే, సెప్టెం బర్ అని మూడు టెర్మ్స్ గా విభజిస్తారు. ఏ టెర్మ్‌‌కైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే ఒక టెర్మ్ లో గరిష్టం గా నాలుగు కోర్సు లకు రిజిస్టర్ కావొచ్చు. ప్రతి కోర్సు డ్యురేషన్ 12 వారాలు. ప్రతి మూడు వారాలకొకసారి క్విజ్ కండక్ట్ చేస్తారు. 12 వారాలకు 12 అసైన్‌ మెంట్స్ ఉంటాయి. అలాగే ఒక ఎండ్ టర్మ్ ఎగ్జా మ్ ఉంటుంది. ఎండ్ టర్మ్ ఎగ్జా మ్ రాయాలంటే అసైన్‌ మెం ట్ ఎగ్జా మ్ లో 100 కి కనీసం 40 మార్కు లు సాధించాలి. ప్రతివారం లెక్చర్స్, శాంపిల్ ప్రాబ్లమ్స్ కలిగిన వీడియో క్లాసెస్ విడుదల చేస్తారు. ప్రతి వీడియో డ్యురేషన్ 12 – 15 నిమిషాలు ఉంటుంది.

కోర్సులు

ఫౌండేషనల్ లెవెల్

మ్యా థమెటిక్స్ ఫర్ డేటా సైన్స్–I

మ్యా థమెటిక్స్ ఫర్ డేటా సైన్స్–II

స్టాటిస్టిక్స్ ఫర్ డేటా సైన్స్–I

స్టాటిస్టిక్స్ ఫర్ డేటా సైన్స్–II

కంప్యూటేషనల్ థింకింగ్

ప్రోగ్రామింగ్ ఇన్ పైథాన్

ఇంగ్లిష్–I

ఇంగ్లిష్–II

డిప్లొమా లెవెల్

డిప్లొమా ఇన్ డేటా సైన్స్

డేటాబేస్ మేనేజ్‌ మెం ట్ సిస్టమ్స్

ప్రోగ్రామింగ్, డేటా స్ర్టక్చర్స్, అండ్ అల్గా రిథ-

మ్స్ యూజింగ్ పైథాన్

ప్రోగ్రామింగ్ కాన్సెప్స్ట్ యూజింగ్ జావా

మోడ్రన్ అప్లికేషన్ డెవలప్‌‌మెం ట్–I

మోడ్రన్ అప్లికేషన్ డెవలప్‌‌మెం ట్–II

స్కి ల్ ఎన్‌ హాన్స్‌‌మెం ట్–I

డిప్లొమా ఇన్ ప్రోగ్రామింగ్

మెషిన్ లెర్నింగ్ ఫౌండేషన్స్

మెషిన్ లెర్నింగ్ థియరీ

మెషిన్ లెర్నింగ్ ప్రాక్టీస్

బిజినెస్ డేటా మేనేజ్‌ మెం ట్

బిజినెస్ అనలిటిక్స్

స్కి ల్ ఎన్‌ హాన్స్‌‌మెం ట్–II

డిగ్రీ లెవెల్

అల్లయిడ్ ఏరియా

కంప్యూటర్ సిస్టమ్స్

కంప్యూటర్ అప్లికేషన్స్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్

కోర్–I కోర్సు

ఆపరేటింగ్ సిస్టమ్

సా ఫ్ట్‌‌వేర్ టెస్టింగ్

ఏఐ: సెర్చ్ మెథడ్స్ ఫర్ ప్రాబ్లం సాల్వింగ్

కోర్–II కోర్సు

కంప్యూటర్ ఆర్కిటెక్చర్

సా ఫ్ట్‌‌వేర్ ఇంజినీరింగ్

డీప్ లెర్నింగ్

అడ్మిషన్ ప్రాసెస్

రెగ్యులర్ ఎంట్రీ, డిప్లొమా ఓన్లీ ఎంట్రీ అని రెం డు రకాలుగా అడ్మిషన్స్ కల్పిస్తారు.

రెగ్యులర్ ఎంట్రీ: రెగ్యులర్ ఎంట్రీలో జాయిన్ అయ్యేవారు ఫౌండేషన్ లెవెల్ లో జాయిన్

అవుతారు. ఈ లెవెల్ లో మ్యా థ్స్, కంప్యూటేషనల్ థింకింగ్, స్టాటిస్టిక్స్, పైథాన్ ప్రోగ్రామింగ్,

ఇంగ్లిష్ వంటి సబ్జెక్టుల్లో బేసిక్స్ తో పాటు డిప్లొమా , డిగ్రీ లెవెల్ కి వెళ్లేలా టీచ్ చేస్తారు. రెగ్యులర్

ఎంట్రీ ద్వారా వచ్చిన వారు మూడు దశల్లో ఎగ్జిట్ కావచ్చు.

ఎగ్జిట్–1:

ఫౌండేషన్ లెవెల్ సర్టిఫికెట్ ఫ్రమ్

సెంటర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్(ఐఐటీ

మద్రాస్)

ఎగ్జిట్–2:

డిప్లొమా ఇన్ ప్రోగ్రామింగ్/డిప్లొమా

ఇన్ డేటా సైన్స్ ఫ్రమ్ ఐఐటీ మద్రాస్. (రెండు డి ప్లొమా లు చేయవచ్చు)

ఎగ్జిట్–3:

బీఎస్సీ డిగ్రీ ఇన్ ప్రోగ్రామింగ్ అండ్ డేటా సైన్స్ ఫ్రమ్ ఐఐటీ మద్రాస్

డిప్లొ మా ఓన్లీ ఎంట్రీ: ఫౌండేషన్ లెవెల్ నాలెడ్జ్ ఉన్నవారు, వర్క్ చేస్తున్న ప్రొఫెషనల్స్ కి ఉద్దేశించిన లెవెల్ ఇది. అయితే ఈ లెవెల్ లో నేరుగా జాయిన్ అయినవారు కేవలం డిప్లొమా కోర్సు మాత్రమే చేయడానికి అర్హులు. వీరు బీఎస్సీ డిగ్రీ కోర్సు చేయలేరు. ఈ సంవత్సరం డిప్లొమా ఓన్లీ ఎంట్రీ లెవెల్ లో అడ్మిషన్స్ జరగడం లేదు. 2021 లో ఓపెన్ కావచ్చు అని నిర్వాహకులు తెలిపారు.

ఎలిజిబిలిటీ:

కనీసం ఇంటర్/10+2 పూర్తి చేయాలి. పదోతరగతిలో ఖచ్చితంగా మ్యా థ్స్, ఇంగ్ లిష్ సబ్జెక్టు లు చదివి వుండాలి. ప్రస్తుతం బీఏ, బీఎస్సీ, బీకాం, బీటెక్, బీఈ ఇలా ఏదో కోర్సు పూర్తి చేసిన వారు లేదా కోర్సులో జాయిన్ అయినవారు లేదా డ్రాప్ అయినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్​లైన్​లో అప్లై చేయాలి. రెగ్యు లర్ ఎంట్రీ దరఖాస్తు ఫీజు రూ.3 వేలు. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్ యూడీ లకు రూ.1500. గరిష్టం గా 2 లక్షల 5 వేల దరఖాస్తులను మాత్రమే అనుమతిస్తారు. చివరి తేదీ కంటే ముందే 2.5 లక్షలు దాటితే దరఖాస్తులు స్వీకరించరు.

సెలెక్షన్ ప్రాసెస్

దరఖాస్తు చేసుకున్నవారంతా ట్రయల్ మంత్ కింద నాలుగు వారాల పాటు వీడియో క్లాసెస్

వినాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఇంగ్ లిష్, డేటాసైన్స్, మ్యా థమెటిక్స్, కంప్యూటేషనల్

థింకింగ్ లో వీడియో కంటెం ట్ రిలీజ్ చేస్తారు. విద్యార్థు లు వాటిని విని ఇచ్చిన అసైన్​మెం ట్స్ ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలి. ప్రతి కోర్సు అసైన్​మెం ట్స్ లో సరాసరి మార్కు లను లెక్కకట్టి అర్హత సాధించిన వారిని కోర్సుకు ఎంపి క చేస్తారు. ఇందుకుగాను జనరల్ అభ్యర్థులు 40 శాతం, ఓబీసీ (నాన్ క్రీమి లేయర్) 35, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్ యూడీలు 30 శాతం మార్కు లు పొందాలి. అసైన్​మెం ట్స్ లో క్వాలి ఫై అయిన వారికి మాత్రమే ఇన్విజిలేటెడ్ ఎగ్జా మ్ నిర్వహిస్తారు.

ఆపర్చూనిటీస్ :

టెక్నాలజీ, టెలికం, మాన్యు ఫాక్చరింగ్, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్‌‌కేర్, ఎనర్జీ, ఈ–

కామర్స్, సోషల్ మీడియా రంగాల్లో బిగ్ డేటా అనలిటిక్స్ ను విరివిగా ఉపయోగిస్తున్నందువల్ల డేటా అనలిటిక్స్, డేటా సైన్స్, ప్రోగ్రామింగ్ ప్రొఫెషనల్స్ కు ఈ రంగాల్లో అధిక అవకాశా లు లభిస్తున్నాయి. ఒక్క అమెరికాలోనే 2020 నాటికి 2.7 మిలి యన్ల డేటా అనలిటిక్స్ రిలేటెడ్ జాబ్‌లు క్రియేట్ అవుతాయని అంచనా. జేపీ మోర్గా న్, కాగ్నిజంట్ టెక్నాలజీ సొల్యూషన్స్, మైక్రోసాఫ్ట్, గూగుల్, జెన్‌ ప్యా క్ట్, టీసీఎస్, ఐబీఎం, విప్రో, డెల్ వంటి సంస్థలు ప్రారంభంలోనే లక్షకు పైగా శాలరీలు అందిస్తున్నాయి. అనలిటిక్స్ నిపుణులను ఎక్కువగా నియమించుకున్న కంపెనీల్లో టీసీఎస్, యాక్సెం చర్, కాగ్నిజెం ట్, ఐబీఎం, జెన్‌ ప్యా క్ట్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌‌పీ, డెలాయిట్, హెచ్‌‌సీ ఎల్ ముందున్నాయి. మల్టినేషనల్ టెక్నాలజీ కంపెనీలు క్యాం పస్ ఇంటర్వ్యూలు నిర్వహించి రిక్రూట్‌‌మెంట్ చేసుకుంటుండగా, మంచి డొమైన్ నాలెడ్జ్ కలిగిన అనలిస్టులు, డేటా సైంటిస్టులకు ప్రారంభంలో కంపెనీని బట్టి దాదాపు రూ.75 వేల నుంచి లక్ష రూపాయల దాకా వేతనాలు అందుతున్నాయి. ఏడెనిమిదే ళ్ల అనుభవం తర్వాత సగటు వార్షిక వేతనం 15 నుంచి 20 లక్షలు ఉంటుందంటే ఆశ్చర్యపోక తప్పదు. కన్సల్టెం ట్ గా పనిచేసినా అధిక రెమ్యూనరేషన్ పొందొచ్చు. యువత సొంతంగా స్టార్టప్స్ ప్రారంభించేందుకు అధిక అవకాశాలున్న రంగం కావడంతో ఇటీవల కాలంలో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లు బిగ్ డేటా కోర్సులు ఎంచుకుంటున్నారు.

గేమ్ చేంజర్ డిగ్రీ ఇది

డేటా డ్రివన్ మార్కెట్ లో దానిని సరిగా ప్రాసెస్ చేసే డేటా సైన్స్ కు డిమాం డ్ పెరిగింది.

ఆ డేటాను సరిగ్గా అమర్చే ప్రోగ్రామర్స్ అవసరం ఎంతైనా ఉంది. స్టా టిస్టిక్స్,

మ్యాథమెటిక్స్, కంప్యూటిం గ్ స్కిల్స్ అవసరం అయిన ప్రోగ్రామింగ్ అండ్ డేటా సైన్స్ లో

ఉన్న డిమాం డ్ ను దృష్టిలో పెట్టు కొని మేము పూర్తిగా ఆన్ లై న్ ప్రోగ్రామ్ లాంచ్

చేస్తున ్నాం. మా ప్రయత్నం మరిన్ని టాప్ ఇనిస్టిట్యూట్స్ కూడా ఆన్ లై న్ డిగ్రీలు

ప్రారంభించి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిం చే ఒక గేమ్ చేం జర్ గా ఉపయోగపడుతుంది.

ప్రొఫెసర్ భాస్కర రామమూర్తి, డైరెక్టర్, ఐఐటీ మద్రాస్.

 

లెవెల్                              కోర్సులు    క్రెడిట్స్     డ్యురేషన్                 ఫీజు

డిప్లొమా ఇన్ ప్రోగ్రామింగ్     6                22             1–2 సంవత్సరాలు     రూ.55,000

డిప్లొమా ఇన్ డేటాసైన్స్      6                22             1–2 సంవత్సరాలు     రూ.55,000

డిగ్రీ లెవెల్                         11               40             1–2 సంవత్సరాలు     రూ.100,000

 

 

ముఖ్య తేదీలు

దరఖాస్తు గడువు తేది: 2020 సెప్టెం బర్ 15

క్వాలిఫైయర్ కోర్సు రిలీజ్ డేట్: 2020 అక్టోబర్ 5

క్వాలిఫైయర్ ఎగ్జామ్: 2020 నవంబర్ 20, 21, 22

రిజిస్ర్టేషన్ (క్వాలిఫై అయినవారికి): 2020 డిసెం బర్ 11 – 2021 జనవరి 3

ఫౌండేషనల్ లెవెల్ బ్యాచ్ ప్రారంభం: 2021 జనవరి 4

వెబ్సైట్www.onlinedegree.iitm.ac.in

వెలుగు ఎడ్యుకేషన్ డెస్క్.

Tagged iit onine courses latest news telugu, iit online courses, iit online courses in telugu, iit online courses latest updates, iit online courses telugu, iit online courses updates in telugu, iit online courses velugu v6, online courses in iit, online courses latest news

Latest Videos

Subscribe Now

More News