ఈ కొత్త రూల్స్​తో టీనేజర్స్​కి ఆన్​లైన్ చాలా​ సేఫ్

ఈ కొత్త రూల్స్​తో టీనేజర్స్​కి ఆన్​లైన్ చాలా​ సేఫ్

ఆన్​లైన్​ క్లాసులు మొదలైనప్పటి నుంచి పిల్లల చేతికి స్మార్ట్​ఫోన్​ ఇయ్యక తప్పట్లేదు. అయితే, ఈమధ్య చిన్నపిల్లలకి కూడా ఆన్​లైన్​ వేధింపులు పెరుగుతున్నాయి. ఆన్​లైన్​లో పిల్లలకి వేధింపులు ఎదురుకాకుండా చూసుకోవడం ఎలా? అని తల్లిదండ్రులు, టీచర్లే కాకుండా, చైల్డ్ సేఫ్టీ అండ్ ప్రైవసీ ఎక్స్​పర్ట్స్​, అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు. అందుకే పిల్లలకి ఆన్​లైన్​ని సేఫ్​గా మార్చేయాలి అనుకుంది గూగుల్. ‘‘ముఖ్యంగా టీనేజర్స్, చిన్నపిల్లలకి ఇంటర్నెట్ బ్రౌజింగ్​ సేఫ్​గా ఉండడం కోసం కొన్ని కండిషన్స్​ తీసుకొచ్చింది’’ అంటున్నాడు గూగుల్ ప్రొడక్ట్  అండ్​ యూజర్​ 
ఎక్స్​పీరియెన్స్ డైరెక్టర్​ మిండీ బ్రూక్స్.   ‘గూగుల్ సెర్చ్​ రిజల్ట్​లో ఉన్న మా  ఫొటోల్ని తొలగించండి’ అని పద్దెనిమిదేళ్ల లోపు పిల్లలు గూగుల్​కి రిక్వెస్ట్ పెట్టొచ్చు.
 

ఫొటో డిలిట్​ రిక్వెస్ట్​  పెట్టడం తెలియని పిల్లల తరఫున వాళ్ల తల్లిదండ్రులు, దగ్గరివాళ్లు రిక్వెస్ట్​ పెట్టే అవకాశం కూడా ఉంది.  అయితే ‘ రిక్వెస్ట్​ పెట్టిన వెంటనే వెబ్​సైట్​ నుంచి ఫొటోల్ని తొలగించరు. సెర్చ్​  రిజల్ట్ నుంచి ఫొటోలు తీసేసినా కూడా అవి వెబ్​లో అలాగే ఉండిపోతాయి. అయినప్పటికీ ఈ మార్పుల​ వల్ల యంగ్​స్టర్స్​ ఆన్​లైన్​లో తమ ఫొటోల్ని ఎవరూ చూడకుండా జాగ్రత్తపడొచ్చు. ఇప్పటి వరకూ పదమూడేళ్లలోపు వాళ్లకే ‘సేఫ్​ సెర్చ్​’ అనేది డిఫాల్ట్​గా ఉండేది. కానీ ఇక నుంచీ 18 యేళ్ల లోపున్న అందరికీ ‘సేఫ్​ సెర్చ్’ డిఫాల్ట్​గా ఉంటుంది.​ యూట్యూబ్​, గూగుల్​, గూగుల్​ అసిస్టెంట్​ యాప్స్​కి ఈ రూల్స్ అప్లై అవుతాయి. బెడ్​ టైంని డిఫాల్ట్​గా గుర్తు చేస్తుంది యూట్యూబ్​. బ్రేక్​ తీసుకోవాలని, రాత్రిపూట టైంకి నిద్రపోవాలని యంగ్ యూజర్లకి రిమైండ్ చేస్తుంది కూడా. అంతేకాకుండా స్టడీకి సంబంధించిన వీడియోలు ఆటో ప్లే కాకుండా వాటిని డిజెబుల్​ చేయాల్సిందిగా కోరుతుంది. మైనర్స్​కి కనిపించాల్సిన యాడ్స్ విషయంలోనూ గూగుల్​  స్ట్రిక్ట్​గా ఉంటోంది. ‘ఏజ్–​సెన్సిటివ్​’ యాడ్స్​,  వయసు, జెండర్​, పద్దెనిమిదేళ్ల లోపు ఉన్నవాళ్ల ఇంట్రెస్ట్​ని టార్గెట్​ చేస్తూ రూపొందించిన యాడ్స్​ని  బ్లాక్​ చేస్తోంది.   ఈ కొత్త రూల్స్​తో టీనేజర్స్​కి ఆన్​లైన్ చాలా​ సేఫ్ అయ్యే అవకాశం ఉంది. డిజిటల్​ ప్రైవసీ కూడా దొరుకుతుంది. 
అంతేకాకుండా ఇక నుంచి ఈ వయసు​ వాళ్ల లొకేషన్​ హిస్టరీ కూడా సేకరించరు.