
- బాల్క సుమన్‌కు ఆన్లైన్లో పీహెచ్డీ వైవా
- ముందు ఆఫ్‌లైన్‌లో షెడ్యూల్ ఇచ్చిన ఓయూ
- ఆ తర్వాత ఆన్లైన్ లో నిర్వహణ
- వర్సిటీ అధికారుల తీరుపై విమర్శలు
ఓయూ, వెలుగు : చెన్నూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు ఓయూ అధికారులు జీ హుజూర్ అన్నారు. ఆఫ్‌లైన్‌లో నిర్వహించాల్సిన పీహెచ్డీ ఫైనల్ వైవాను ఆన్లైన్లో నిర్వహించారు. ప్రత్యేక అనుమతులిచ్చినట్టు చెప్తున్నా దీనిపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఓయూలో బాల్క సుమన్ ఇంగ్లిష్ సబ్జెక్టులో 2016–-17లో పీహెచ్డీ అడ్మిషన్ తీసుకున్నారు. నిరుడు నవంబర్ లో థీసిస్ సబ్మిట్ చేశాడు. తర్వాత ఫైనల్ వైవాకు తేదీలు ఖరారు చేశారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఇంగ్లిష్ డిపార్ట్ మెంట్ సెమినార్ హాల్లో వైవా ఉంటుందని ప్రకటించారు.
ఈ విషయాన్ని ఓయూ అధికారులు నోటీస్ బోర్డుపై చెప్పాల్సి ఉన్నా బయటకు చెప్పలేదని సమాచారం. అయితే, ఆఫ్‌లైన్‌లో నిర్వహించాల్సిన వైవాను ఓయూ అధికారులు ఆన్లైన్లో నిర్వహించారు. తాను ఫిజికల్ గా హాజరు కాలేనని, ఆన్‌లైన్‌కు పర్మిషన్ ఇవ్వాలని సుమన్ విజ్ఞప్తి చేయగా అందుకు అధికారులు పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సుమన్ ఆన్లైన్ వైవా పూర్తిచేయడంతో అధికారులు ఆయనకు పీహెచ్‌డీని డిక్లేర్ చేశారు.
ఆన్ లైన్ లో పర్మిషన్ ఎలా ఇస్తరు?
కరోనా టైమ్ లో మాత్రమే ఫిజికల్ గా హాజరుకాలేని వారికి ఆన్ లైన్ లో ఇంటర్వ్యూలకు అనుమతులు ఇచ్చారని, ఇప్పుడు ఎలా ఇస్తారని ఓయూ జేఏసీ లీడర్ సురేశ్ యాదవ్ అధికారులను ప్రశ్నించారు. ఎమ్మెల్యే సీతక్క ఫిజికల్‌గా వచ్చారని గుర్తు చేశారు. .