50.4 శాతం కుటుంబాలు సైకిల్‌పైనే ఆధారపడుతున్నయట..

50.4 శాతం కుటుంబాలు సైకిల్‌పైనే ఆధారపడుతున్నయట..

ఈ రోజుల్లో టీవీ, ఫ్రిజ్ లాంటి వస్తువులు దాదాపు అందరి ఇంట్లోనూ ఉంటున్నాయి. కానీ నిజానికి అవి దేశంలో ఎంత మందికి ఉన్నాయో తెలుసా... దీనిపై ఇటీవల జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చేపట్టిన అధ్యయనంలో ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి. టీవీ, ఫ్రిజ్‌, వాషింగ్‌ మిషన్‌ ఉన్న కుటుంబాలు 16 శాతం మాత్రమేనని సర్వేలో తేలింది. దేశంలో ఇప్పటికే 50 శాతం కుటుంబాలకు ద్విచక్ర వాహనం లేదని, కేవలం 7 శాతం కుటుంబాలకు కారు ఉందని తెలిపింది. దీన్ని బట్టి చూస్తే.. భారతీయుల్లో ఎంతమంది ధనవంతులు ఉన్నారో మీకే అర్ధమైపోతుంది. 

దీంతోపాటు 49 శాతం భారతీయ కుటుంబాలకు ద్విచక్ర వాహనాలున్నాయని.. 50.4 శాతం కుటుంబాలు సైకిల్‌పైనే ఆధారపడుతున్నాయని ఈ సర్వే చెప్పుకొచ్చింది. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్‌ల విషయానికొస్తే 68 శాతం ఇళ్లలో టీవీ.. 38 శాతం మందికి ఫ్రిజ్.. 18 శాతం కుటుంబాల్లో వాషింగ్ మిషన్ ఒక్కటే ఉన్నట్లు తేలింది. అలాగే దేశంలో సైకిల్, ద్విచక్ర వాహనం, కారు కూడా లేని కుటుంబాల సంఖ్య 24.7 శాతంగా ఉంది. దేశంలోని 24 శాతం కుటుంబాలకు ఎయిర్ కండిషనర్లు లేదా ఎయిర్ కూలర్లు ఉన్నాయని స్పష్టం చేసింది.