భారత్ గెలవాలంటే పంత్ రాణించాలి

భారత్ గెలవాలంటే పంత్ రాణించాలి

ముంబై: ఇంగ్లండ్ గడ్డపై జరగనున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్స్ ను గెలవడం టీమిండియాకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ విషయం మీద భారత మాజీ వికెట్ కీపర్ సబా కరీం స్పందించాడు. న్యూజిలాండ్ తో జరిగే ఈ సిరీస్ లో భారత్ నెగ్గాలంటే యువ కీపర్ రిషబ్ పంత్ రాణించడం కీలకమని కరీం చెప్పాడు. 

'ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్స్ కు టీమిండియా చేరడంలో పంత్ ముఖ్య భూమిక పోషించాడు. నిజంగా చెప్పాలంటే భారత్ ఈ పోటీకి అర్హత సాధించడంలో అందరికంటే కీలక పాత్ర పోషించింది పంత్ అని ఒప్పుకొని తీరాలి. టెస్ట్ టీమ్ లోకి పంత్ వచ్చాక భారత జట్టు మంచి సమతూకంతో కనిపిస్తోంది. పంత్ వల్లే కోహ్లీ ఐదుగురు బౌలర్లను ఆడిస్తున్నాడు. అతడు వేగంగా ఆడుతూ ప్రత్యర్థుల నుంచి మ్యాచ్ లను లాక్కుంటున్నాడు. ఇదే ఆటను రాబోయే టెస్ట్ చాంపియన్ షిప్ లోనూ అతడు కొనసాగించాలి' అని సబా కరీం సూచించాడు.