గాంధీ పెయింటింగ్కు వేలంలో రూ.1.7 కోట్లు

గాంధీ పెయింటింగ్కు వేలంలో రూ.1.7 కోట్లు

లండన్‌‌: మహాత్మా గాంధీ అరుదైన ఆయిల్‌‌ పెయింటింగ్‌‌ను వేలం వేశారు. లండన్‌‌లోని బోన్‌‌హామ్స్‌‌లో నిర్వహించిన వేలంలో దాదాపు 1.7 కోట్ల (152800 ఫౌండ్లు)కు ఈ చిత్రం అమ్ముడుపోయింది. బ్రిటీష్‌‌ ఆర్టిస్ట్‌‌ క్లేర్‌‌‌‌ లైటన్‌‌ మహాత్మా గాంధీ చిత్రాన్ని గీశారు.

 గాంధీ చిత్రపటం అంచనా వేసిన దానికంటే మూడు రెట్లు అధిక ధరకు అమ్ముడైంది. ట్రావెల్‌‌ అండ్‌‌ ఎక్స్‌‌ప్లోరేషన్‌‌ ఆన్‌‌లైన్‌‌ సేల్‌‌లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన చిత్రంగా ఇది నిలిచింది. బోన్‌‌హామ్‌‌ సేల్‌‌ హెడ్‌‌ రియానాన్‌‌ డెమెరీ మాట్లాడుతూ.. ఈ ప్రత్యేక కళాకృతిని ఇంతకుముందు ఎప్పుడూ వేలంలో ప్రదర్శించలేదన్నారు. చరిత్రలో ఒక ముఖ్యమైన క్షణానికి ఈ చిత్రం నిదర్శనమని పేర్కొన్నారు.

►ALSO READ | అలాస్కాలో 7.3 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ