‘వినరో భాగ్యము విష్ణు కథ’ నుంచి ఓ బంగారం పాట విడుదల

‘వినరో భాగ్యము విష్ణు కథ’ నుంచి ఓ బంగారం పాట విడుదల

కిరణ్ అబ్బవరం హీరోగా మురళీ కిశోర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. కశ్మీర పర్దేశీ హీరోయిన్. ఫిబ్రవరి 17న సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం ప్రమోషనల్ టూర్స్‌‌ చేస్తున్న టీమ్,  ‘ఓ బంగారం’ అంటూ సాగే పాటను గురువారం గుంటూరులో విడుదల చేశారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ పాటను కపిల్ కపిలన్ పాడారు. ‘ఓ బంగారం నీ చెయ్యి తాకగానే..  ఉప్పొంగిపోయిందే నా ప్రాణం’ అంటూ భాస్కరభట్ల లిరిక్స్ రాశారు.

పాట విడుదల సందర్భంగా హీరో కిరణ్ మాట్లాడుతూ ‘ఈ సాంగ్ నాకు చాలా స్పెషల్. భాస్కరభట్ల గారు మంచి లిరిక్స్ ఇచ్చారు. ఈ పాటలాగే సినిమా కూడా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ప్రేక్షకులకు సినిమాను మరింత దగ్గర చేయాలని రిలీజ్‌‌కు నెల ముందు నుండి ప్రమోషన్ టూర్స్ స్టార్ట్ చేశాం’ అన్నాడు. ‘ఈ పాటను సోషల్ మీడియా రీల్‌‌గా చేసి గీతా ఆర్ట్స్‌‌ను ట్యాగ్ చేస్తే.. అందులో పది మందిని సెలెక్ట్ చేసి సినిమా చూపించడంతో పాటు ‘పుష్ప 2’ షూటింగ్‌‌కి కూడా తీసుకెళ్తాం’ అన్నారు నిర్మాత బన్నీ వాసు.