చమురు ఉత్పత్తి పెంచనున్న ఒపెక్‌ ప్లస్‌

చమురు ఉత్పత్తి పెంచనున్న ఒపెక్‌ ప్లస్‌

న్యూఢిల్లీ:  ఇరాన్ యుద్ధం కారణంగా  క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో, ఒపెక్ ప్లస్  కూటమి ఆదివారం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జులై నుంచి రోజుకు 1.88 లక్షల బ్యారెళ్ల  చొప్పున అదనంగా ముడి చమురు ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించింది. ఆయిల్‌ మార్కెట్‌ను స్థిరంగా ఉంచడానికి,  ధరలు  గరిష్టాల్లో ఉండడంతో లాభాలు పొందడానికి  ఈ నిర్ణయం తీసుకున్నారు. 

అయితే, ఇరాన్ ఆధీనంలో ఉండే కీలకమైన హార్మూజ్‌ జల సంధి మూతపడి ఉన్నంత వరకు, ఈ స్వల్ప ఉత్పత్తి పెంపు వల్ల మార్కెట్ ధరలపై ఎలాంటి ప్రభావం ఉండదని నిపుణులు చెబుతున్నారు.  ఇది కేవలం ఒక పాలసీ సిగ్నల్ మాత్రమేనని అన్నారు.