విజయా డయాగ్నోస్టిక్స్‌‌లో ఫుజిఫిల్మ్‌‌ ఓపెన్ ఎంఆర్‌‌‌‌ఐ

విజయా డయాగ్నోస్టిక్స్‌‌లో ఫుజిఫిల్మ్‌‌ ఓపెన్ ఎంఆర్‌‌‌‌ఐ

హైదరాబాద్‌‌, వెలుగు : దేశంలోని మొదటి ఓపెన్‌‌ ఎంఆర్‌‌‌‌ఐ మెషీన్‌‌   విజయా డయాగ్నోస్టిక్స్ అమీర్‌‌‌‌పేట్‌‌ సెంటర్‌‌‌‌లో  అందుబాటులోకి వచ్చింది. అపెర్టో లుసెంట్ పేరుతో  పిలుస్తున్న ఈ  మెషీన్‌‌ను ఫుజిఫిల్మ్‌‌ ఇండియా తయారు చేసింది.  ఈ ఓపెన్‌‌  ఎంఆర్‌‌‌‌ఐ కోసం రూ. 6 కోట్లు ఖర్చు చేశామని,  రానున్న నెలల్లో పరిస్థితులను బట్టి మరిన్ని సెంటర్లలో ఈ మెషీన్‌‌ను అందుబాటులోకి తెస్తామని విజయా డయాగ్నోస్టిక్స్‌‌   చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వాసన్ శేషాద్రి అన్నారు.

ఇమేజ్ క్వాలిటీ తగ్గకుండా స్కానింగ్ టైమ్ పెంచేలా ఐపీ–ర్యాపిడ్ టెక్నాలజీని ఓపెన్ ఎంఆర్‌‌‌‌ఐ మెషీన్‌‌లో వాడామని  ఫుజిఫిల్మ్‌‌ వైస్ ప్రెసిడెంట్‌‌ శేఖర్ సిబల్‌‌ అన్నారు. ఈ మెషీన్‌‌ను ఇన్‌‌స్టాల్ చేయడం సులభమని, మెయింటనెన్స్​ ఖర్చు కూడా తక్కువని పేర్కొన్నారు.