ఫిబ్రవరి 12 నుంచి ఓపెన్ స్కూల్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపులు

ఫిబ్రవరి 12 నుంచి ఓపెన్ స్కూల్ ఎగ్జామ్  ఫీజు చెల్లింపులు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఆధ్వర్యంలో ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించే టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు ఈ నెల 12 నుంచి ఫీజు చెల్లించాలని టాస్ డైరెక్టర్ పీవీ శ్రీహరి, జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి తెలిపారు. అభ్యర్థులు ఎలాంటి ఫైన్ లేకుండా ఈ నెల 21 వరకు ఫీజు చెల్లించవచ్చని చెప్పారు.

రూ.25 ఫైన్​తో ఈనెల 22 నుంచి 27 వరకూ, రూ.50 ఫైన్​తో మార్చి 4 వరకూ ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. అభ్యర్థులు ఆన్​లైన్​లోనే ఫీజు చెల్లించాలని, డీడీ, చాలన్స్ ద్వారా చెల్లించొద్దని సూచించారు.