అహోబిల మఠంలో గోశాల ప్రారంభోత్సవం

అహోబిల మఠంలో గోశాల ప్రారంభోత్సవం

భద్రాచలం, వెలుగు : భద్రాచలంలోని అహోబిల మఠంలో బుధవారం గోవింద సహిత గోశాల ప్రారంభ వేడుకలు మొదలయ్యాయి. గోమాతను సంరక్షించాలనే లక్ష్యంతో సుందరమైన గోశాలను శ్రీనృసింహసేవా సమితి అహోబిల మఠంలో నిర్మించింది. ఐదు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తొలిరోజు ప్రత్యేక పూజలు చేశారు.

చిన్నారులతో శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. కోదాడకు చెందిన జొన్నలగడ్డ రమణస్వామి అనే భక్తుడు నరసింహస్వామి అలంకరణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.  కార్యక్రమంలో కృష్ణ చైతన్య, ట్రస్టీ శ్రీధర్​, వేదపండితులు శ్రీనివాస్​శర్మ, నవీన్​, పవన్​కుమార్​ శర్మ తదితరులుపాల్గొన్నారు.