గర్భాన్ని తెరిచి పిండానికి ఆపరేషన్

గర్భాన్ని తెరిచి పిండానికి ఆపరేషన్
  • కడుపులో బిడ్డ వెన్నుపూస రంద్రాన్ని పూడ్చిన డాక్టర్లు

లండన్: ఐదు నెలల పిండం. అప్పుడే కనుబొమ్మలు వస్తున్నాయి.పుర్రె, వెన్నుపూస గట్టిపడుతోంది. భర్తతో కలిసి రెగ్యు లర్‌‌ చెకప్‌‌ కోసం డాక్టర్‌‌ వద్దకు వెళ్లింది బెథన్ సింప్సన్. బిడ్డ వెన్నుముక ఎదగడం లేదని, అందులో చిన్న హోల్ (స్పైనా బై ఫైడా) ఏర్పడటమే ఇందుకు కారణమని డాక్టర్ లు చెప్పా రు. పుట్టబోయే పాప లోపంతో జన్మిస్తుందన్నారు. అబార్షన్‌చేయించుకోవడం మంచిదని చెప్పారు. సింప్సన్‌‌ గుండె పగిలింది. కన్నపేగును చంపుకోలేక బిడ్డకు జన్మనిచ్చి తీరుతానని చెప్పింది. దీంతో కొత్తగా అందుబాటులోకి వచ్చిన‘ఫీటస్ రిపేర్’ టెక్నిక్ తో బిడ్డ వెన్నుపూసను సరి చేయొచ్చని, అయితే దీనివల్ల తల్లీబిడ్డ ప్రాణాలకు ముప్పు తప్పదని హెచ్చరించారు. దానికి కూడా ఆ తల్లి సిద్ధపడింది. లండన్ లోని గ్రేట్ ఆర్మం డ్ స్ట్రీట్ హాస్పి టల్లో చేరింది. పిండానికి ఆరు నెలల వయసొచ్చేవరకూ ఆగిన డాక్టర్ లు మంగళవారం 4 గంటలకు పైగా సర్జరీ చేశారు. గర్భాన్ని తెరిచి పిండంలోని పాప వెన్ను పూసలో ఏర్పడిన రంధ్రాన్ని పూడ్చారు. ఆపరేషన్ సక్సెస్ అయింది. తల్లి మనసు కుదుటపడింది. హాస్పి టల్‌‌లో ఆనందం వెల్లివిరిసింది. వచ్చేజూన్ నెలలో సింప్సన్ డెలివరీ అవుతుందని డాక్టర్ లు చెప్పారు. యూకేలో ఏటా 200 మంది పిల్లలు ఈ సమస్య (స్పైనా బైఫైడా)తో పుడుతున్నారు. దీన్నుం చి బిడ్డల్ని కాపాడేందుకు ఫీటస్ రిపేర్  టెక్నిక్ ను కనుగొన్నారు. ఇప్పటివరకూ ముగ్గురు మహిళలు ఈ సర్జరీ చేయించుకున్నారు. సింప్సన్ నాలుగో మహిళ.