
కరోనా భయం వెంటాడుతున్నప్పటికీ అనేక దేశాలు క్రమంగా కరోనా ఆంక్షలను ఎత్తివేస్తున్నాయి. అయితే ఆంక్షల్ని ఎత్తివేయడంపై డబ్ల్యూహెచ్ ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ స్పందించారు.
ప్రపంచ దేశాలు ఆంక్షల్ని ఎత్తివేస్తున్నాయని…నియంత్రణం లేకుండా అన్ లాక్ చేయడం విపత్తును స్వాగతించినట్లవుతుందన్నారు.
కరోనా సంక్షోభం ప్రారంభమై దాదాపు 8 నెలల కావస్తున్న తరుణంలో ఆంక్షల కారణంగా ప్రజలు విసిగిపోయారన్న వాస్తవాన్ని ఆయన అంగీకరించారు.
పిల్లలు స్కూళ్లకు, పెద్దలు ఉద్యోగాలకు వెళ్లాలని, అదే సమయంలో అందరూ క్షేమంగా ఉండాలన్నదే తమ ఉద్దేశమని వ్యాఖ్యానించారు. అంతేకాదు కరోనా ముగిసిందనే ఏ దేశం బావించకూడదని ..నియంత్రణ చర్యలు లేకుండా దేశాల్లో ఆంక్షల్నిఎత్తివేస్తే విపత్తును ఆహ్వానించినట్టే అని టెడ్రోస్ వ్యాఖ్యానించారు.