మరో 235 మంది వచ్చిన్రు

మరో 235 మంది వచ్చిన్రు

ఆపరేషన్ అజయ్​లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో 235 మంది ఇండియన్లను ఇజ్రాయెల్ నుంచి తిరిగి తీసుకొచ్చింది. శుక్రవారం తొలి ఫ్లైట్ లో 212 మంది ఢిల్లీకి చేరుకోగా.. శనివారం రెండో ఫ్లైట్ లో 235 మంది వచ్చారని కేంద్రం వెల్లడించింది.

కాగా, ఇజ్రాయెల్ లో 18 వేల మంది ఇండియన్లు ఉన్నారు. ఇండియన్ల కోసం ఆదివారం మరో రెండు స్పెషల్ ఫ్లైట్లు అరేంజ్ చేస్తామని ఇజ్రాయెల్ తెలిపింది.