
‘పలాస’ చిత్రంతో హీరోగా గుర్తింపును తెచ్చుకున్న రక్షిత్ అట్లూరి వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. వాటిలో ‘ఆపరేషన్ రావణ్’ ఒకటి. తన తండ్రి వెంకట సత్య దర్శకత్వంలో రూపొందుతోంది. ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. సంగీర్తన విపిన్ హీరోయిన్. రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సోమవారం రక్షిత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. రక్షిత్ సీరియస్‌గా పరుగెత్తుతూ వెళ్తున్న పోస్టర్ పై ‘మీ ఆలోచనలే మీ శత్రువులు’ అనే క్యాప్షన్ రాయడం సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని వచ్చే నెలలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.