
భారత.. పాకిస్తాన్ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ గురించి కేంద్రం బ్రీఫింగ్ ఇచ్చింది. పాక్ దాడులను సమర్దవంతంగా తిప్పికొట్టామని కల్నల్ సోఫియా తెలిపారు. నిన్న రాత్రి ( మే 9 ) దాదాపు 26 చోట్ల దాడులు చేశారని ఆమె తెలిపారు, పాకిస్తాన్ ఆర్మీ విచక్షణా రహితంగా దాడులు చేస్తుందని తెలిపారు. పంజాబ్ ఎయిర్ బేస్కు దాడికి ప్రయత్నిస్తే పాక్ దుశ్చర్యను నిర్వీర్యం చేశామని తెలిపారు. యుద్దం విషయంలో పాక్ తప్పుడు ప్రకటనలు చేస్తుందని తెలిపారు. పాకిస్తాన్ ఫైటర్ జెట్లు భారత భూభాగంలోనికి అనేక సార్లు చొచ్చుకొచ్చాయని వాటిని తిప్పి కొట్టామని కల్నల్ ఖురేషి తెలిపారు.