Operation Valentine OTT: OTTకి ఆపరేషన్ వాలెంటైన్.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Operation Valentine OTT: OTTకి ఆపరేషన్ వాలెంటైన్.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine). కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా(Shakthi prathap singh hada) తెరకెక్కించిన ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ మనిషి చిల్లర హీరోయిన్ గా నటించారు. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా మార్చ్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

పుల్వామా, బాలకోట్ అటాక్స్ ఆధారంగా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి నెగిటీవ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. దీంతో ఈ సినిమా మినిమమ్ కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. ఇప్పటికే గని, గాండీవధారి అర్జున సినిమాల పరాజయాలతో సతమతమవుతున్న వరుణ్ కు ఈ సినిమా మరో ప్లాప్ ను మిగిల్చింది. దీంతో ఆపరేషన్ వాలెంటైన్ థియేట్రికల్ రన్ కష్టంగా మారింది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. 

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మార్చ్ 29 లేదా ఏప్రిల్ మొదటివారంలో స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి థియేటర్స్ లో ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.