వరుణ్ తేజ్ హీరోగా.. ఆపరేషన్ వాలెంటైన్

వరుణ్ తేజ్ హీరోగా.. ఆపరేషన్ వాలెంటైన్

వరుణ్ తేజ్ హీరోగా యాడ్ ఫిల్మ్ మేకర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా డైరెక్షన్‌‌‌‌లో ఓ సినిమా రూపొందుతోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో రూపొందుతున్న ఈ యాక్షన్ మూవీ టైటిల్‌‌‌‌ను సోమవారం అనౌన్స్ చేశారు. ‘ఆపరేషన్ వాలెంటైన్’ అనే ఇంటరెస్టింగ్‌‌‌‌ టైటిల్‌‌‌‌ను ఫైనల్‌‌‌‌ చేశారు. 

రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌‌‌‌ పాత్ర పోషిస్తున్నాడు వరుణ్ తేజ్. రాడార్ ఆఫీసర్ పాత్రలో మానుషి చిల్లర్ కనిపించనుంది. ఇదొక ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎంటర్‌‌‌‌టైనర్. 

దేశభక్తితో పాటు వైమానిక దళ వీరుల స్ఫూర్తిని, వైమానిక దాడులలో వారు ఎదుర్కొన్న సవాళ్లను ఇందులో చూపిస్తామంటున్నారు మేకర్స్. సోనీ పిక్చర్స్, రినైసెన్స్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 8న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.