33 వాట్ల చార్జింగ్​తో ఒప్పో కొత్త ఫోన్​

33 వాట్ల చార్జింగ్​తో ఒప్పో కొత్త ఫోన్​

33 వాట్ల చార్జింగ్​తో ఒప్పో కొత్త ఫోన్​

చైనీస్​ స్మార్ట్​ఫోన్​ మేకర్​ ఒప్పో ఏ58 పేరుతో బడ్జెట్​ ధరలో 5జీ ఫోన్​ను లాంచ్​ చేసింది. ఇందులో 6.72-అంగుళాల స్క్రీన్​, మీడియాటెక్​ హీలియో జీ85 ప్రాసెసర్​, అండ్రాయిడ్​13, వెనుక డ్యూయల్   కెమెరా యూనిట్, 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 33 వాట్ల ఫాస్ట్​ చార్జింగ్​, 5,000 ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటాయి. 6 జీబీ + 128 జీబీ వేరియంట్‌‌‌‌ ధర  రూ. 14,999.

శామ్​సంగ్ ​ప్రొడక్టుల బుకింగ్స్​ స్టార్ట్​
 దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్‌‌‌‌సంగ్  భారతదేశంలో తాజాగా లాంచ్​ చేసిన ఫోల్డబుల్ స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌లతో పాటు గెలాక్సీ వాచ్​6, గెలాక్సీ ట్యాబ్​ ఎస్​9 ప్రీబుకింగ్స్​ మొదలయ్యాయి. ముందస్తుగా- బుకింగ్స్​పై అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఫోన్​ను ప్రీబుక్​ చేస్తే కనీసం రూ.20 వేల విలువైన లాభాలు ఉంటాయి. వాచ్​ల ధరలు రూ.30 వేల నుంచి మొదలవుతాయి. వీటిపై రూ.10 వేల విలువైన ఆఫర్లు ఉన్నాయి. ట్యాబ్​లపై రూ.14 వేల విలువైన లాభాలు పొందవచ్చని శామ్​సంగ్​ తెలిపింది.

కొత్త ఫ్లేవర్లతో  బాస్కిన్​ రాబిన్స్​ ఐస్​క్రీమ్​లు..
మరికొన్ని రోజుల్లో రాబోతున్న ఇండిపెండెన్స్​డే సందర్భంగా బాస్కిన్​ రాబిన్స్ కొత్త ఫ్లేవర్లను పరిచయం చేసింది. వీటిలో అల్ఫోన్సో మ్యాంగో, గులాబ్​ జామూన్​ ఐస్​క్రీమ్​, క్యారమిల్​ మిల్క్​ కేక్​ ఐస్​క్రీమ్​లు ఉన్నాయి. అన్ని బేకరీల్లో, రిటైల్​ అవుట్​లెట్లలో ఇవి లభిస్తాయని కంపెనీ తెలిపింది.

162 సీసీ ఇంజన్​తో హోండా ఎస్పీ 160
జపనీస్​ ఆటో కంపెనీ హోండా ఎస్పీ 160 పేరుతో ప్రీమియం బైక్​ను లాంచ్​ చేసింది. ఇందులోని 162.71 సీసీ  సింగిల్ -సిలిండర్ ఇంజన్  7,500 ఆర్పీఎం వద్ద 13.27 బీహెచ్​పీని, 5,500 ఆర్​పీఎం వద్ద 14.58 ఎన్​ఎం టార్క్​ను ఇస్తుంది.  ఇది 5-స్పీడ్ గేర్‌‌‌‌బాక్స్‌‌‌‌తో వస్తుంది. ఇది రెండు వేరియంట్లలో వస్తుంది.  సింగిల్- డిస్క్ ధర 1,17,500 కాగా,  ట్విన్-డిస్క్ వేరియంట్​ ధర రూ.1,21,900 ( ఎక్స్-షోరూమ్ ధరలు).