ఇండియాకు ఒప్పో రెనో 10x

ఇండియాకు ఒప్పో రెనో 10x

చైనా స్మార్ట్​ఫోన్ల కంపెనీ ఒప్పో.. ఇండియా మార్కెట్లోకి రెనో 10ఎక్స్​ జూమ్​, రెనో ఫ్లాగ్​షిప్ ఫోన్లను విడుదల చేసింది. పదిరెట్ల లాస్​లెస్​ హైబ్రిడ్​ ఆప్టికల్​ జూమ్​, సైడ్​ స్వింగ్​ సెల్ఫీ కెమెరా రెనో 10ఎక్స్​ ప్రత్యేకత. దీని 6జీబీ వెర్షన్​ ధర రూ.40 వేలు కాగా, 8జీబీ వేరియంట్​ ధర రూ.50 వేలు. మంగళవారం నుంచే ప్రిబుకింగ్స్​ ప్రారంభించామని కంపెనీ తెలిపింది. ఇందులో 6.60 ఇంచుల స్క్రీన్​, క్వాల్​కామ్​ 855 ప్రాసెసర్​, 16 ఎంపీ సెల్ఫీ కెమెరాలు, అండ్రాయిడ్​ పై ఓఎస్​, వెనుక మూడు కెమెరాలు, 4,000 ఎంఏహెచ్​ బ్యాటరీ వంటి పీచర్లు ఉన్నాయి. ఇక ఒప్పో రెనోలో 6.40 ఇంచుల స్క్రీన్​, క్వాల్​కామ్​ 710 ప్రాసెసర్​, 16 ఎంపీ సెల్ఫీ కెమెరాల,  వెనుక రెండు కెమెరాలు, 3,765 ఎంఏహెచ్​ బ్యాటరీ వంటి పీచర్లు ఉన్నాయి. దీని 8జీబీ ర్యామ్​ వేరియంట్​ ధర రూ.32,990.