వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు 12న పాట్నాలో విపక్షాల మీటింగ్

వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు 12న పాట్నాలో విపక్షాల మీటింగ్

న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో బీజేపీని కలసికట్టుగా ఎదుర్కొనేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు వచ్చే నెల 12న పాట్నాలో ప్రతిపక్షాలు సమావేశం కానున్నాయని విశ్వసనీయ వర్గాలు ఆదివారం తెలిపాయి. ఈ మీటింగ్ లో 18 పార్టీల నేతలు పాల్గొంటారని చెప్పాయి. ‘‘ఇది కేవలం సన్నద్ధత సమావేశం. అసలు మీటింగ్ తర్వాత ఉంటుంది” అని ఓ ప్రతిపక్ష నేత పేర్కొన్నారు. కాగా, విపక్షాలను ఏకం చేసేందుకు బీహార్ సీఎం నితీశ్ కొద్దిరోజులుగా ప్రయత్నిస్తున్నారు.

బెంగాల్ సీఎం మమత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్​తో సమావేశమయ్యారు. ఇటీవల కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, రాహుల్​తోనూ భేటీ అయ్యారు.
రాహుల్​కు కొత్త పాస్​పోర్టు రాహుల్ గాంధీకి ఆదివారం కొత్త పాస్ పోర్టు అందిందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. సోమవారం నుంచి రాహుల్​ వారం పాటు అమెరికాలో పర్యటిస్తారు. స్టాన్ ఫోర్డ్​ వర్సిటీ విద్యార్థులతో పాటు ఇండియన్ అమెరికన్లతో రాహుల్​ ఇంటరాక్ట్ అవుతారు.