జెనరిక్​ మెడిసన్స్​ వాడాలన్న నిర్ణయంపై వెనక్కి తగ్గిన వైద్య కమిషన్​

జెనరిక్​ మెడిసన్స్​ వాడాలన్న నిర్ణయంపై వెనక్కి తగ్గిన వైద్య కమిషన్​

డాక్టర్లు.. పేషెంట్లకు జెనరిక్​ మందులే రాయాలని, ఫార్మా కంపెనీల నుంచి గిఫ్ట్ లు తీసుకుంటే బ్యాన్​ విధిస్తామని, ఏదైనా మెడిసన్​ని ప్రమోట్​ చేయాలని చూసినా చర్యలు తీసుకుంటామని ఇటీవల నేషనల్​ మెడికల్​ కమిషన్​ ఆదేశాలిచ్చింది. 

తాజాగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఆగస్టు 24న వెల్లడించింది. కమిషన్​ ఆదేశాలు వెనక్కి తీసుకోవాలంటూ ఇండియన్​ మెడికల్​అసోసియేషన్, ఇండియన్ ఫార్మాస్యూటికల్​ అలయన్స్ చేసిన వినతితో ఆదేశాలు నిలిపివేసింది. 

నేషనల్​ మెడికల్​ కమిషన్​ – 2023 పేరుతో విడుదల చేసిన ఆదేశాలను వెంటనే నిలిపేస్తున్నాం. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని ఎన్​ఎంసీ స్పష్టం చేసింది.  

బ్రాండెడ్ ఔషధాల కంటే జనరిక్ ఔషధాలు 30 నుంచి 80 శాతం చౌకగా లభిస్తాయని ఈ నిర్ణయంతో ఆరోగ్య సంరక్షణ ఖర్చులు తగ్గుతాయని కమిషన్​ భావించింది. ఈ నిర్ణయం వెలువరించినప్పటి నుంచి ఎన్‌ఎంసీ ఉత్తర్వులను వైద్యులు వ్యతిరేకిస్తున్నారు. 

ఇండియాలో జెనరిక్ ఔషధాల నాణ్యత, నియంత్రణ బలహీనంగా ఉందని, అలాంటి నిబంధనలు రోగులకు ప్రమాదం కలిగిస్తాయని వైద్యులు వాదించారు. ఈ క్రమంలో కమిషన్​ తాజాగా తన నిర్ణయం ప్రకటించింది.