అమెరికా అధ్యక్ష ఎన్నికలు : చట్టబద్ధమైన గంజాయి, మ్యాజిక్ మష్రూమ్స్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు :  చట్టబద్ధమైన గంజాయి, మ్యాజిక్ మష్రూమ్స్

అమెరికా లో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఫలితాలు విడుదలవ్వుతున్నాయి. ఈ ఫలితాల్లో అమెరికా అధ్యక్ష పదవి చేపట్టే అభ్యర్ధి 270 స్థానాల్లో విజయం సాధించాలి. ప్రస్తుతం విడుదలైన ఫలితాల ప్రకారం డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ 238 స్థానాలు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి ట్రంప్ 213స్థానాలకు కైవసం చేసుకున్నారు.

ఈ సందర్భంగా న్యూజెర్సీలోని ఓటర్లు గంజాయి, మ్యాజిక్ మష్రూమ్స్ పబ్లిక్ గా కొనుగోలు చేసేందుకు మద్దతు పలికారు. దీంతో మ్యాజిక్ మష్రూమ్స్ , గంజాయి  వాడకాన్ని చట్టబద్ధం చేసిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లో మొదటి రాష్ట్రంగా న్యూజెర్సీ  అవతరించింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ గంజాయితో పాటు మ్యాజిక్ మష్రూమ్స్ ను బహిరంగంగా వినియోగించేలా చట్టబద్ధం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ..,న్యూజెర్సీలో గంజాయి, మ్యాజిక్ మష్రూమ్స్ వాడకం చట్టబద్ధమైంది. ఇది జాతి, సామాజిక న్యాయం, మన ఆర్థిక వ్యవస్థలో ఇదో పెద్ద అడుగు అంటూ ట్వీట్ చేశారు.

మ్యాజిక్ మష్రూమ్స్ తింటే కిక్కే కిక్కు

ఒక రకమైన ఫంగస్ తో ఈ పుట్టగొడుగుల తయారవుతాయి. వీటిలో ‘సిలోసిబిన్’ అనే కెమికల్ ఉంటుంది. మనిషికి పిచ్చి పిచ్చి ఊహలు రావడానికి కారణమిదే. వీటిని తిన్న వారికి ఎదుటివాళ్లు వింతగా కనిపిస్తారని, మాటలు చిత్రంగా వినిపిస్తాయని, ప్రపంచాన్ని మరో కోణంలో చూస్తారని యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ పేర్కొంది. అమెరికా ‘సిలోసిబిన్’ను హెరాయిన్, ఎల్ఎస్డీ లాంటి డ్రగ్ గా పరిగణిస్తోంది. ప్రపంచంలోని చాలా దేశాలు దీని వాడకాన్ని నిషేధించాయి.