
వివిధ సినిమా ఇండస్ట్రీల్లో మోస్ట్ పాపులర్ హీరోలు ఎవరనే విషయంలో..ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ 'ఓర్మాక్స్ మీడియా' (Ormax Media) 2023 గాను సర్వే నిర్వహించింది. అందులో టాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్ హీరోలు ఎవరు అనేది టాప్ 10 జాబితాను ప్రకటించింది ఓర్మాక్స్ మీడియా.
2023 కి గాను తెలుగు ప్రేక్షకుల నుంచి ఎక్కువ అభిమానాన్ని సంపాదించుకున్న నటుడిగా రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. ఆ తర్వాత స్థానంలో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, నాని, చిరంజీవి విజయ్ దేవరకొండ, రవితేజ ఉన్నారు.
Top 10 most popular male Telugu film stars of 2023#Ormax2023 #OrmaxStarsIndiaLoves #OrmaxSIL pic.twitter.com/HTg5Bt222Q
— Ormax Media (@OrmaxMedia) January 22, 2024
ఇక 'ఓర్మాక్స్ హీరోయిన్స్ లిస్ట్ లో మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా సమంత, నిలువగా.. తర్వాత రోండో స్థానంలో కాజల్ ఉన్నారు. ఆమె తర్వాత అనుష్క, సాయి పల్లవి, రష్మిక, శ్రీలీల, ఇక ఏడో స్థానంలో కీర్తి సురేష్ ఉండగా..టాప్ టెన్‌లో అనుపమ పరమేశ్వరన్ ఉన్నారు.
ప్రస్తుతం ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏదేమైనప్పటికీ..ఈ ప్రకటన సంస్థ ప్రకటించిన సర్వే మాత్రమే..అభిమానుల గుండెల్లో తమ హీరోల స్థాయి ఎప్పుడో టాప్ లోనే ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే సంస్థ నిర్వహించిన సర్వే.. ప్రతి నెలకోసారి..ఏడాదికోసారి మారుతూ ఉంటుంది. అభిమానుల గుండెల్లో మాత్రం హీరోలు స్థాయి పదిలంగా ఉంటుంది.
Top 10 most popular female Telugu film stars of 2023#Ormax2023 #OrmaxStarsIndiaLoves #OrmaxSIL pic.twitter.com/Rih0VZEpN1
— Ormax Media (@OrmaxMedia) January 22, 2024