
హైదరాబాద్, వెలుగు: జాన్సన్ అండ్ జాన్సన్ బ్రాండ్ కెన్వ్యూ.. ప్రజాశక్తి ఓఆర్ఎస్ఎల్ తన హైడ్రేషన్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. క్యాలరీల గురించి శ్రద్ధ చూపే వినియోగదారుల కోసం ఓఆర్ఎస్ఎల్ జీరో ఎలక్ట్రోలైట్ డ్రింక్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
ఈ కొత్త డ్రింక్ శరీరాన్ని రీహైడ్రేట్ చేయడంలో సహాయపడుతుందని, జీరో చక్కెర, జీరో క్యాలరీలతో ఎలక్ట్రోలైట్లను అందిస్తుందని తెలిపింది. ఇది ఆరోగ్య స్పృహ కలిగిన వారిని ఆకట్టుకుంటుందని పేర్కొంది. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టేవారికి ఇది అనువుగా ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది.