ఆస్కార్ అవార్డ్స్ జ్యూరీ మెంబర్లుగా..కీరవాణి-చంద్రబోస్- చరణ్-ఎన్టీఆర్

ఆస్కార్ అవార్డ్స్ జ్యూరీ మెంబర్లుగా..కీరవాణి-చంద్రబోస్- చరణ్-ఎన్టీఆర్

RRR మూవీ ఆస్కార్ తో ప్రపంచ వ్యాప్తంగా సాధించిన ఘనత చరిత్రకెక్కింది. ఈ మూవీ గురుంచి హాలీవుడ్ దిగ్గజాలు సైతం మాట్లాడుకుంటున్నారు. తెలుగోడి సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిందిగా నిలిచినా ఈ మూవీకు మరో గౌరవం దక్కించుకుంది. 

తాజాగా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS 2023) లో సంస్థలో చేరడానికి 398 మంది ప్రముఖ ఆర్టిస్టులను, ఎగ్జిక్యూటివ్ లకు ఇన్విటేషన్ అందింది. ఆర్టిస్టుల విభాగం నుంచి రామ్ చరణ్(Ram Charan)-, ఎన్టీఆర్(N.T.R) సెలెక్ట్ అయినట్లు AMPAS తెలిపింది. 

టెక్నిషన్స్ విభాగంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి(M. M. Keeravani)-, పాటల రచయిత చంద్రబోస్(Chandrabose) లకు, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్(K. K. Senthil Kumar) లకు ఈ  AMPAS సభ్యుల జాబితాలో చోటు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. 

ఈ అరుదైన గౌరవం దక్కడం వెనుకాల నాటు నాటు సాంగ్ ఎంతో  స్పెషల్ రోల్ అని చెప్పుకోవాలి. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ లో మొత్తం 398 మందికి ఈ  సంస్థలో చేరడానికి అవకాశం దక్కినట్లు AMPAS ప్రకటించింది. ఇటువంటి అవకాశం రావడం కేవలం ఆస్కార్ దక్కించుకుంటే రాదని వారి వారి ప్రొఫెషనల్ లో టాలెంట్ కీలకం అని తెలిపింది. 

ఇప్పటికే క్రేయేటివ్ డైరెక్టర్ మణిరత్నం ఈ జాబితాలో కనిపించడం ఆనందాన్ని కలిగిస్తున్న అంశం. ఆర్.ఆర్.ఆర్ దర్శకుడు రాజమౌళి(S.S. Rajamouli) పేరు కనిపించకపోవడం కొంత నిరాశ కలిగించే అంశం అయినా మన తెలుగు సినిమా ఈ ఖ్యాతి దక్కడంతో భాగమైనందుకు రాజమౌళి కృషి ఉండటం గర్వించాల్సిన విషయంగా భావిస్తున్నారు సినీ క్రిటిక్స్.