రేపే ‘ఆస్కార్‌ ‘ అవార్డుల ప్రదానం

రేపే ‘ఆస్కార్‌ ‘ అవార్డుల ప్రదానం

ఆస్కార్‌ అవార్డుల సందడి షురూ అయ్యింది. 91వ ఆస్కార్‌ అవార్డుల ప్రధానోత్సవం లాస్‌ ఎంజెల్స్‌ వేదికగా అంగరంగ వైభవంగా రేపటి (సోమవారం,ఫిబ్రవరి-25) నుంచి జరగనుంది. సినిమా రంగంలో ఆస్కార్‌కు ఎంతో విశిష్టత ఉంది. హాలీవుడ్‌ సినిమా పండగగా అభివర్ణించే ఆస్కార్‌ అవార్డుల కోసం ప్రపంచ దేశాలన్నీ అమితమైన ఆసక్తితో ఎదురుచూస్తుంటాయి. జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్‌ అవార్డు అందుకుంటే ఇంక సాధించాల్సిందేమీ ఉండదని సినీ ప్రముఖులు భావిస్తుంటారు. సినీ అవార్డుల్లో ఎవరెస్ట్‌ లాంటి ఆస్కార్‌ పురస్కారోత్సవం ఇప్పుడు మళ్లీ వచ్చింది. భారత కాలమానం ప్రకారం ఫిబ్రవరి 25 ఉదయం 91వ ఆస్కార్‌ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్నిలాస్‌ ఏంజెల్స్‌ లోని డాల్బీ థియేటర్‌లో అత్యంత వైభవంగా ఈసారి ఉత్తమ చిత్రం రేసులో బ్లాక్‌ పాంథర్‌, వైస్‌, రోమా, బొహేమియన్‌ రాప్పొడీ, ఏ స్టార్‌ ఈజ్‌ బోర్న్‌ తదితర సినిమాలున్నాయి. ఉత్తమ నటుడి అవార్డు కోసం క్రిస్టియన్‌ బేల్‌, బ్రాడ్లీ కూపర్‌, విలెమ్‌ డాఫో, రామిమాలెక్‌, విగ్గో మార్టెన్సమ్‌ పోటీపడుతున్నారు. అత్య ధికంగా ‘రోమా, ‘ది ఫేవరెట్‌ చిత్రాలకు 10విభాగాల్లో నామినేషన్లు దక్కాయి. ‘ఏ స్టార్‌ ఈజ్‌ బోర్న్‌, ‘వైస్‌ మూవీలకు ఎనిమిది విభాగాల్లో, ‘బ్లాక్‌ పాంథర్‌కు 7విభాగాల్లో ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యాయి.