మొదలైన ఆస్కార్ ఓటింగ్.. ప్యానెల్‌‌‌‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్

మొదలైన ఆస్కార్ ఓటింగ్.. ప్యానెల్‌‌‌‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్

సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ కలగనే అవార్డు ఆస్కార్. జీవితంలో ఒక్కసారైనా ఈ అవార్డును అందుకోవాలనుకుంటారు. ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆస్కార్ అవార్డుల వేడుకకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 96వ ఆస్కార్ అవార్డుల వేడుక మార్చి 10న లాస్ ఏంజెల్స్‌‌‌‌లో జరగనుంది.

దీనికిగాను శుక్రవారం నుంచి ఓటింగ్ ప్రక్రియను మొదలుపెట్టారు. జనవరి 16 సాయంత్రం 5 గంటల వరకు ఇది సాగుతుంది. ఆస్కార్ అకాడమీలో పదివేల మందికి పైగా సభ్యులు ఉన్నారు. ఈ ప్యానెల్‌‌‌‌లో టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్‌‌తో పాటు పలువురు ఇండియన్ సినీ సెలబ్రిటీస్ కూడా ఉండటం విశేషం.   ఈ నెల 23న ఆస్కార్ నామినేషన్స్‌‌‌‌ను ప్రకటిస్తారు.