ఆస్కార్ అవార్డ్స్.. భారత్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?

ఆస్కార్ అవార్డ్స్.. భారత్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?

సినీ తారాగణంతో పాటు యావత్ర్పపంచం మార్చి 12న లాస్ ఏంజిల్స్ లో జరగబోయే ఆస్కార్ అవార్డ్స్ వేడుక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎక్కడ చూసినా ఈవెంట్ లో పాల్గొనే స్టార్స్ నుంచి రెడ్ కార్పెట్ పై నడిచే తారలు, నామినేట్ అయిన సినిమాలు, పలు విభాగాల్లో నామినేట్ అయిన నటుల గురించే చర్చించుకుంటున్నారు. అయితే ఈ అద్భుతమైన వేడుకను ఎలా చూడాలి.. మన దేశంలో ఎప్పుడు లైవ్ స్ట్రీమ్ అవుతుందన్న విషయాలు ప్రస్తుతం ఆసక్తిగా మారాయి. 

మామూలుగా అయితే ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ మార్చి 12న లాస్ ఏంజిల్స్ లో రాత్రి 8గంటలకు ప్రారంభం కానుంది. అదే భారత్ లో అయితే మార్చి 13న ఉ.6.30 నుంచి 7గంటల మధ్య ప్రత్యక్ష ప్రసారం కానుంది. యూట్యూబ్, హులు లైవ్ టీవీ, డైరెక్ట్ టీవీ, FUBO TVతో సహా వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ ను ప్రసారం చేయడానికి ABC నెట్‌వర్క్ అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు AT&T TV సబ్‌స్క్రిప్షన్‌తో నూ ఆస్కార్‌ అవార్డ్స్ ప్రదానోత్సవాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చు.