యూఎస్ ఓపెన్ లో టాప్ సీడ్ కి షాక్! క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్

యూఎస్ ఓపెన్ లో టాప్ సీడ్ కి షాక్! క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్


     
యూఎస్ ఓపెన్ లో రెండో వారంలో సంచలనం చోటు చేసుకుంది. టాప్ సీడ్ ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ ఈగా స్వైటెక్ నాలుగో రౌండ్ లోనే ఇంటి దారి పట్టింది. టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన స్వైటెక్ కి 20 వ సీడ్ ఒస్తాపెంకో షాక్ ఇచ్చింది. తొలి సెట్ (6-3)ని  సులభంగానే నెగ్గిన స్వైటెక్ ఆ తర్వాత రెండు సెట్లలో(3-6, 1-6) తన అత్యున్నత ఆట తీరు ప్రదర్శించలేక చతికిలపడిపోయింది.   స్వైటెక్ తన సర్వీస్ ని ఏకంగా 7 సార్లు కోల్పోగా.. చివరి రెండు సెట్లలో పదే పదే అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. దీంతో ఒస్తాపెంకో   క్వార్టర్ ఫైనల్ కి చేరుకుంది. మార్ వైపు కొక గాఫ్ 6-3, 3-6, 6-1 తేడాతో వోజ్నియాకి పై గెలుపొందింది. 10 వ సీడ్ ముచోవా, 30 వ సీడ్ సిరిస్తే కూడా  క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు.

ALSO READ :ఢిల్లీలో లాక్ డౌన్... క్లారిటీ ఇచ్చిన పోలీసులు

 
జొకోవిచ్ జోరు:


ఇక పురుషుల్ సింగిల్స్ విషయానికి వస్తే రెండో సీడ్, 23 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు వీరుడు జొకోవిచ్ క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. అన్ సీడెడ్ గోజోని 6-2,7-5,6-4 తేడాతో చిత్తుగా ఓడించాడు. 24 వ గ్రాండ్ స్లామ్ వేటలో దూసుకుపోతున్న సెర్బియన్ స్టార్ మ్యాచ్ మొత్తం మీద తన సర్వీస్ ని కేవలం ఒక్కసారే కోల్పోగా.. ప్రత్యర్థి సర్వీస్ ని 5 సార్లు బ్రేక్ చేసాడు. జొకోవిచ్ తో పాటు అమెరికన్ ఆశా కిరణం టియాఫై 6-4, 6-1,6-4 తేడాతో హైజికతపై, ఫ్రిట్జ్ 7-6(7-2), 6-4,6-4 తో స్ట్రకర్ పై నెగ్గారు. క్వార్టర్ ఫైనల్ లో జొకోవిచ్ ఫ్రిట్జ్ తో సెమిస్ బెర్త్ కోసం అమీ తుమీ తేల్చుకోనున్నాడు. మరో  క్వార్టర్స్ లో షెల్టాను తో టియాఫై తలపడతాడు.