ఈ వారం ఓటీటీలో 'అర్జున ఫల్గుణ' 

ఈ వారం ఓటీటీలో 'అర్జున ఫల్గుణ' 

కరోనా క్ర‌మంల‌ భారీ బడ్జెట్ సినిమాల‌న్ని విడుదల వాయిదా వేసుకున్నాయి. ప్రతి వారం డబ్బింగ్ చిత్రాలు, చిన్న సినిమాలు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తున్నాయి.  ఈ వారం కూడా ఓటీటీలో విడుదలవుతున్న సినిమా వివ‌రాలు ఓసారి చూద్దాం.
 
ఓటీటీలో విడుదలవుతున్న చిత్రం: శ్రీ విష్ణు హీరోగా నటించిన 'అర్జున ఫల్గుణ' చిత్రం డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఆహా వేదికగా ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 26 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభంకానుంది. ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన అమృతా అయ్యర్ నటించింది.