సంక్రాంతి సినిమాలపై OTTల కొత్త రూల్.. అయితే నెలకి.. లేకపోతే వారానికే!

సంక్రాంతి సినిమాలపై OTTల కొత్త రూల్.. అయితే నెలకి.. లేకపోతే వారానికే!

కొరోనా తరువాత ఓటీటీ(Ott)ల డిమాండ్ బాగా పెరిగిపోయింది. థియేటర్స్ తో ఈక్వల్ గా కంటెంట్ ను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నాయి. వారవారం కొత్త కొత్త కంటెంట్ తో ముందుకు వస్తుండటంతో.. ప్రేక్షకులు కూడా ఓటీటీల వైపు మొగ్గుచూపిస్తున్నారు. కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతుంటే.. కొన్నేమో థియేట్రికల్ రన్ ను ముగించుకొని ఓటీటీ బాటపడుతున్నాయి. ఇందుకోసం భారీ మొత్తాన్ని చెల్లించి సినిమా రైట్స్ తీసుకుంటున్నాయి ఓటీటీ సంస్థలు. అది కూడా థియేటర్ లో సినిమా రిలీజైన ఎనిమిది వారాల తరువాత మాత్రమే టెలికాస్ట్ చేసుకునే వీలుంటుంది. 

ALSO READ :అదిరిపోయిన దమ్ మసాలా సాంగ్.. తమన్ కుమ్మేసాడు

అయితే 2024 సంక్రాంతికి వస్తున్న సినిమాలపై మాత్రం ఓటీటీ సంస్థలు కొత్త రూల్ ను పెట్టనున్నాయట. అదేంటంటే.. థియేటర్ లో రిలీజైన సినిమా హిట్ అయితే నెల రోజుల తరువాత.. ప్లాప్ అయితే రెండు వారాల తరువాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసుకునే వీలుండేలా కండిషన్ పెట్టేయటా. ఆ కండీషన్ కు ఓకే అయితేనే.. ఓటీటీ రైట్స్ తీసుకుంటామని చెప్పాయట. దీంతో మేకర్స్ కి ఇది కాస్త కష్టమే అయినా కూడా పరిస్థితి ను దృష్టిలో పెట్టుకొని ఒకే చెప్పేశాయని సమాచారం. మరి ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో ఏది హిట్ అవుతుందో.. ఏది ప్లాప్ గా నిలువనుందో చూడాలి.