
కొత్త తరహా కంటెంట్ కోరుకునే వారికి ఓటీటీ ఒక ఆల్టర్‌నేట్‌గా మారింది. ఇప్పటికే చాలామంది మేకర్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు, వెబ్ సిరీసులతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు. తాజాగా దిల్ రాజు కూడా వెబ్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. దర్శకుడు హరీష్ శంకర్‌తో కలిసి ‘ఏటీఎమ్’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్ పేరుతో రూపొందనున్న ఈ సిరీస్‌కి హరీష్ శంకర్ కథ అందించారు. సి.చంద్రమోహన్ దర్శకుడు. దిల్ రాజు కూతురు హన్షిత నిర్మిస్తున్నారు. జీ5లో స్ట్రీమ్ కానున్న ఈ వెబ్ సిరీస్ త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ ‘వెబ్ సిరీస్ చేయడం న్యూ ఎక్స్‌పీరియెన్స్. హరీష్ శంకర్ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో, ఏడు ఎపిసోడ్స్‌గా ఈ సిరీస్ రానుంది’ అని చెప్పారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ ‘వెబ్ సిరీస్ చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. మంచి ఐడియా వచ్చింది. నేను చెప్పిన కథను చంద్రమోహన్ ఎపిసోడ్ వైజ్‌గా బ్రేక్ చేస్తూ కొత్త కథగా రెడీ చేసి సర్‌ప్రైజ్ చేశాడు’ అని అన్నారు. ‘రాజు గారి బ్యానర్‌లో మూవీ చేయడం నా డ్రీమ్. హరీష్ ఇచ్చిన స్ర్కిప్ట్‌తో అది నెరవేరుతున్నందుకు హ్యాపీ’ అన్నారు దర్శకుడు. కొత్త ప్లాట్‌ఫామ్‌తో వస్తున్న తమను ఆదరించాలని కోరారు హన్షిత. జీ5 వైస్ ప్రెసిడెంట్ పద్మ కార్యక్రమంలో పాల్గొన్నారు.