OTT MOVIES : అమల మూవీ..కేస్ క్లోజ్ అయ్యిందా!

OTT MOVIES : అమల మూవీ..కేస్ క్లోజ్ అయ్యిందా!

కేస్ క్లోజ్ అయ్యిందా!

టైటిల్ : అమల

డైరెక్షన్​ : నిశద్​ ఇబ్రహీం

కాస్ట్ : అనార్కలీ మరికర్, శ్రీకాంత్, అప్పని శరత్, రజీష విజయన్

లాంగ్వేజ్ : మలయాళం, తెలుగు, తమిళం

ప్లాట్​ ఫాం : అమెజాన్ ప్రైమ్

మొన్ననే ‘పోర్ తొళిల్’ అనే తమిళ సినిమాకి రెస్పాన్స్ బాగా వచ్చింది. అదే జానర్​లో మలయాళంలో ‘అమల’ అనే సినిమా రిలీజ్ అయింది. ఇందులో ఒక సైకో కిల్లర్ వరుస హత్యలు చేస్తుంటాడు. ఆ మర్డర్​ కేసుల్ని డీల్ చేయడానికి పోలీస్​ ఆఫీసర్ అక్బర్​ (శ్రీరామ్) ప్రయత్నిస్తుంటాడు. అయితే ఈ కథ అన్ని సైకోపాత్​ మూవీస్​లా కాకుండా కొంచెం డిఫరెంట్​గా ఉంటుంది. అనార్కలి మరికర్ పర్ఫార్మెన్స్, పోలీస్ ఆఫీసర్​గా శ్రీరామ్​ నటన బాగుంది. బాసిల్​ క్యారెక్టర్​లో అప్పని శరత్​ బాగానే చేశాడు. సైకో కిల్లర్ ఇచ్చే ట్విస్ట్​లు పర్లేదు అనిపించినా, పోలీస్​ ఆఫీసర్ ఇంటెలిజెన్స్ మాత్రం పెద్దగా కనిపించదు. హంతకుడి గతానికి, ప్రెజెంట్​కి కనెక్షన్​ ఏంటి? ఒక సైకో కిల్లర్​ కేస్​ని పోలీస్​ ఆఫీసర్ ఎలా సాల్వ్ చేశాడు? అనేది స్టోరీ. కానీ, ఈ సినిమాలో పెద్దగా చెప్పుకోదగ్గ సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఏం లేవు. స్క్రిప్ట్​, స్ర్కీన్​ ప్లే, డైరెక్షన్ యావరేజ్​. సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. దీనికి సెకండ్ పార్ట్​ కూడా ఉందట!

షజమ్​ పవర్స్ ఎవరి సొంతం?

టైటిల్ : షజమ్​ - ఫ్యూరి ఆఫ్​ ది గాడ్స్

డైరెక్షన్​ : డేవిడ్ శాండ్​బర్గ్

కాస్ట్ : జచరీ లెవీ, ఆడమ్ బ్రాడీ, మార్తా మిలాన్స్, రేచల్ జెగ్లెర్, హెలెన్ మిర్రెన్, మేగన్ గుడ్, లూసీ, జెయొఫ్ జాన్స్, పీటర్ శాఫ్రన్

లాంగ్వేజ్ : తెలుగు, ఇంగ్లీష్​

ప్లాట్​ ఫాం : జియో సినిమా

‘షజమ్’ సినిమాకి ఇది సీక్వెల్. ఒక మంత్రగాడు పవర్​ఫుల్ గ్రీక్ దేవుళ్ల నుంచి శక్తుల్ని దొంగిలించి వాళ్లు బయటకు రాకుండా ట్రాప్ చేస్తాడు. కానీ, గ్రీక్​ దేవుళ్లలో అత్యంత శక్తివంతమైన దేవుడు అట్లాస్. ఆయన స్వర్గాన్ని తన చేతులతో మోస్తూ ఉంటాడని చెప్తారు. అయితే అలాంటి శక్తివంతమైన దేవుడి ముగ్గురు కూతుళ్లు ట్రాప్​ నుంచి బయటకు వస్తారు. ఆ ముగ్గురు తమ పవర్స్​ని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. శక్తులు పొందిన బిల్లీ, తన ఫ్యామిలీగా చెప్పే తన గ్రూప్​ మెంబర్స్ అందరూ టీనేజర్స్​. శక్తుల్ని ఉపయోగించేటప్పుడు మాత్రం వాళ్లు పెద్దవాళ్లుగా మారుతుంటారు. అలా వాళ్లు తమ టీనేజ్​ లైఫ్​ని, అడల్ట్ సూపర్ హీరో ఫామ్​ని రెండింటినీ బ్యాలెన్స్ చేయడం నేర్చుకుంటుంటారు. అట్లాస్ ముగ్గురి కూతుళ్లను బిల్లీ, తన ఫ్యామిలీ ఎలా ఎదుర్కొన్నారు? షజమ్ ఫ్యామిలీకి ఏం జరిగింది? అట్లాస్ కూతుళ్లు తయారుచేయాలనుకునే వెపన్ ఏంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. యాక్షన్​, ఎమోషన్స్ ఫస్ట్​ మూవీలో ఉన్నట్లే  సీక్వెల్​లోనూ ఉన్నాయి. డైరెక్షన్​, మ్యూజిక్ బాగున్నాయి. 
 

ఆ నలుగురు నవ్విస్తారు

టైటిల్ : గన్స్ అండ్ గులాబ్స్ (వెబ్ సిరీస్)

డైరెక్షన్​ : రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే

కాస్ట్ : రాజ్​ కుమార్ రావ్​, దుల్కర్​ సల్మాన్, ఆదర్శ్​ గౌరవ్, గుల్షన్ దేవయ్య, శ్రేయా ధన్వంతరి, పూజా గోర్, సతీష్​ కౌశిక్, వరుణ్ బడోల

లాంగ్వేజ్ : హిందీ, తెలుగు, ప్లాట్​ ఫాం : నెట్​ ఫ్లిక్స్

టిప్పు (రాజ్​ కుమార్ రావ్) గులాబ్​ గంజ్​లో బైక్​ మెకానిక్. టిప్పు రెండు హత్యలు చేస్తాడు. దొరికిపోతాడనే భయంతో ఆ ఊరి నుంచి పారిపోవాలనుకుంటాడు. గాంచీ (సతీశ్) అనే ధనవంతుడు స్మగ్లింగ్​ చేయిస్తుంటాడు. అతని కొడుకు చోటా గాంచీ (ఆదర్శ్ గౌరవ్) తండ్రిలా అవ్వాలని, గుర్తింపు కోసం తపన పడుతుంటాడు. నార్కోటిక్స్ ఆఫీసర్ అర్జున్ వర్మ (దుల్కర్ సల్మాన్) చాలా స్ట్రిక్ట్​ పోలీస్ ఆఫీసర్. గులాబ్​ గంజ్​లో స్మగ్లింగ్ చేసే గ్యాంగ్​లను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. చార్ కట్ ఆత్మారాం అనే కిల్లర్ పాత్రలో గుల్షన్ దేవయ్య నటించాడు. టిప్పు పారిపోయాడా? లేదా? చోటా గాంచీ లక్ష్యం నెరవేరుతుందా? ఆఫీసర్ అర్జున్​ స్మగ్లర్స్​ని ఎలా పట్టుకుంటాడు? చార్ కట్ ఆత్మారాంకి ఈ కథకు లింక్​ ఏంటి? వంటి విషయాలన్నీ తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే. ఇందులో గుల్షన్​ దేవయ్య క్యారెక్టర్​, యాక్టింగ్ బాగున్నా... స్క్రీన్​ టైం తక్కువైంది. అడల్ట్ కంటెంట్​ లేదు. కానీ, డైలాగ్స్​లో కొన్ని చోట్ల వాడిన భాష వినడానికి ఇబ్బందిగా ఉంటుంది. రన్​ టైం చాలా ఎక్కువ అనిపిస్తుంది.