కిక్ ఫ్రైడే.. OTTలోకి 20 కి పైగా చిత్రాలు, సిరీస్‌లు.. యాక్షన్, కామెడీ, రొమాన్స్, హారర్, థ్రిల్లర్స్ తో రెడీ!

కిక్ ఫ్రైడే.. OTTలోకి 20 కి పైగా చిత్రాలు, సిరీస్‌లు.. యాక్షన్, కామెడీ, రొమాన్స్, హారర్, థ్రిల్లర్స్ తో రెడీ!

ఈ వారం OTT ప్రియులకు పండుగే! ఫ్రైడే వస్తుందంటే చాలు.. సరికొత్త కంటెంట్‌తో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సందడి చేస్తాయి. అయితే, ఈసారి ఏకంగా 20కి పైగా సినిమాలు, సిరీస్‌లు సెప్టెంబర్ 26న ఒక్కరోజే విడుదల కాబోతున్నాయి. యాక్షన్, హారర్, కామెడీ, రొమాన్స్, సైకలాజికల్ థ్రిల్లర్... ఇలా అన్ని రకాల జోనర్‌లలో ప్రేక్షకులను కిక్కిచ్చే కంటెంట్ సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ ఈ వారం అత్యధిక కంటెంట్‌ను విడుదల చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

అయితే, ఈ రిలీజ్‌లలో కొన్ని సినిమాలు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతున్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే 'ఘాటి' (Ghaati) చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో, రొమాంటిక్ మలయాళ చిత్రం 'హృదయం పూర్వం' జియో సినిమా (JioCinema)లో స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి.  ఈ సినిమాలతో పాటు ఇతర OTT ప్లాట్‌ఫామ్‌లలో విడుదలయ్యే ముఖ్యమైన కంటెంట్‌ను ఇప్పుడు చూద్దాం..

 

నెట్‌ఫ్లిక్స్‌లో 10కి పైగా భారీ రిలీజ్‌లు

'ధడక్ 2' (Dhadak 2): బాలీవుడ్ నుంచి వస్తున్న ఈ రొమాంటిక్ డ్రామాపై మంచి అంచనాలు ఉన్నాయి.

 

'సనాఫ్ సర్దార్' (Sanaaf Sardar): మరో బాలీవుడ్ మూవీ.

 

'ది గెస్ట్' (The Guest), 'అలైస్' (Alice): ఈ రెండు ఇంగ్లీష్ సిరీస్‌లు గ్రిప్పింగ్ స్టోరీలతో ప్రేక్షకులను కట్టిపడేయడానికి సిద్ధంగా ఉన్నాయి.

'మాంటిస్' (Mantis): దక్షిణ కొరియా నుంచి వస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ.

►ALSO READ | ఈడీ విచారణకు హాజరైన నటుడు జగపతి బాబు.. నాలుగు గంటలు ప్రశ్నించిన అధికారులు

వీటితో పాటు, మలయాళ చిత్రం 'ఒడుమ్ కుతిరా చడుమ్ కుతిరా', అలాగే 'హౌస్ ఆఫ్ గిన్నీస్', 'ఫ్రెంచ్ లవర్', 'రుత్ అండ్ బోజ్' వంటి ఆసక్తికరమైన ఇంగ్లీష్ చిత్రాలు కూడా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అవుతున్నాయి.

 

జీ5 (Zee5): మలయాళ హారర్-థ్రిల్లర్ మూవీ 'సుమతి వళవు' తో పాటు, హిందీ సిరీస్ 'జనావర్: ద బీస్ట్ వితిన్' స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి.

 

సన్ నెక్స్ట్ (Sun NXT): తెలుగు రొమాంటిక్ చిత్రం 'మేఘాలు చెప్పిన ప్రేమకథ' విడుదలై తెలుగు ప్రేక్షకులను అలరించనుంది.

 

లయన్స్ గేట్ ప్లే (Lionsgate Play): యాక్షన్ ప్రియుల కోసం 'డేంజరస్ యానిమల్స్' (Dangerous Animals) సిద్ధమైంది.

 

 

సెప్టెంబర్ 26న విడుదలవుతున్న ఈ సినిమాల పండుగతో, వీకెండ్‌లో ఎంటర్టైన్‌మెంట్ డోస్ గ్యారెంటీ అంటున్నాయి ఓటీటీ  ప్లాట్‌ఫామ్‌లు.