బాల్క సుమన్ కు వ్యతిరేకంగా .. ఓయూ జేఏసీ విద్యార్థుల ప్రచారం

బాల్క సుమన్ కు వ్యతిరేకంగా  .. ఓయూ జేఏసీ విద్యార్థుల ప్రచారం

చెన్నూరు, వెలుగు: ఎమ్మెల్యే బాల్క సుమన్ కు వ్యతిరేకంగా ఓయూ జేఏసీ విద్యార్థులు చెన్నూర్​పట్టణంలో గురువారం ప్రచారం నిర్వహించారు. బీఆర్ ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ కు ప్రజలు ఓటేయొద్దని కోరుతూ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. 

ఓయూ జేఏసీ నాయకుడు సురేశ్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రం కోసం ప్రాణాలను పణంగా పెట్టి తాము పోరాటం చేస్తే ఆ ఫలాలను పొందింది మాత్రం సుమన్ అని విమర్శించారు. తన స్వలాభం కోసం ఎంతో మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేశాడని ఆరోపించారు.

ALSO READ: ప్రపంచ దేశాలు మాకు థ్యాంక్స్ చెప్పాలి: జైశంకర్