ప్రపంచ దేశాలు మాకు థ్యాంక్స్ చెప్పాలి: జైశంకర్

ప్రపంచ దేశాలు మాకు థ్యాంక్స్ చెప్పాలి: జైశంకర్

లండన్: రష్యా‑ఉక్రెయిన్ యుద్ధ సమయంలో రష్యా నుంచి  భారత్ చమురును కొనుగోలు చేసి ప్రపంచ వ్యాప్తంగా ధరలు పెరగకుండా చేసిందని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ అన్నారు. తద్వారా అంతర్జాతీయ ద్రవ్యోల్బ ణాన్ని కట్టడి చేసిందని చెప్పారు. ఈ  విషయంలో ప్రపంచ దేశాలన్ని తమకు థ్యాంక్స్ చెప్పాలన్నారు. బుధవారం లండన్ లోని భారత్ హై కమిషన్ కార్యాలయంలో జై శంకర్ మీడియాతో మాట్లాడారు. 

ALSO READ: బీజేపీ పవర్ లోకొస్తే.. కాంగ్రెస్‌‌‌‌ స్కీమ్‌‌‌‌లన్నీ ఆగుతయ్‌‌‌‌ : రాహుల్‌‌‌‌ గాంధీ

“రష్యా నుంచి చమురును కొనుగోలు చేయకుంటే అంతర్జాతీయ మార్కెట్లలోని విక్రేతల వద్దకే మేం కూడా వెళ్లాల్సి వచ్చేది. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెద్ద ఎత్తున పెరిగేవి. ఫలితంగా అదే ధరకు యూరప్ దేశాలు కూడా చమురును కొనుగోలు చేయాల్సిన పరిస్థితి  ఉత్పన్నం అయ్యేది. అదే సమయంలో  లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్ జీ) మార్కెట్స్ లో  ఆసియాకు రావాల్సిన సరఫరాదారులు యూరప్ దేశాలకు వెళ్లారు. కొన్ని చిన్న దేశాలు దాఖలు చేసిన టెండర్లపై కూడా స్పందించేందుకు ఆ సరఫరాదారులు నిరాకరించారు. అందువల్ల ఆ సరఫరాదారులతో డీలింగ్ చేయకుండానే రష్యా నుంచి చమురును కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయం తీసుకున్నది” అని జై శంకర్ పేర్కొన్నారు.