డిస్నీలో మన ‘బ్రహ్మోత్సవం’ అవంతిక

V6 Velugu Posted on Aug 10, 2021

చూడముచ్చటగా ఉండే తెలుగింటి అమ్మాయిలా పట్టుపరికిణితో ‘బ్రహ్మోత్సవం’  సినిమాలో కనిపించి ఆకట్టుకుంది అవంతిక. తెలుగు, ఇంగ్లీష్ భాషలు గడగడా మాట్లాడగలదు. యాక్టింగ్​ కోసం ఎంతైనా కష్టపడుతుంది. ఆ హార్డ్​వర్క్​ వల్లే హాలీవుడ్​లోనూ ఛాన్స్​లు కొట్టేసింది. ఈ నెలలో ఇండిపెండెన్స్​డే రోజు రిలీజ్ అవుతున్న స్పిన్​ అనే ఫిల్మ్​లో లీడ్ రోల్ చేసింది. 

అవంతిక వందనపు ఇండియన్ అమెరికన్​ అమ్మాయి. పుట్టింది కాలిఫోర్నియాలో. 2015లో 12 ఏళ్లప్పుడు అవంతిక ఇండియా వచ్చింది. అప్పుడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌‌‌‌గా చేయమని చాలా ఆఫర్లు వచ్చాయి. 2016లో తెలుగులో మహేశ్​బాబు సినిమా ‘బ్రహ్మోత్సవం’లో  కూడా నటించింది. ఆడిషన్​ కోసం డాన్స్, యాక్టింగ్​​ వీడియోలు పంపిస్తే ఈ అవకాశం వచ్చిందట. అవంతిక చాలా యాక్టివ్, హార్డ్ వర్కింగ్. ఒక్కోసారి షూటింగ్​ తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఏడు గంటల వరకూ జరిగేది. అప్పుడు కూడా ముఖంలో ఏమాత్రం డల్​నెస్​ కనిపించకుండా ఎంతో యాక్టివ్​గా ఉండేదట. 2018లో తిరిగి అమెరికా వెళ్లిపోయింది అవంతిక.

డిస్నీలో ఛాన్స్​ అలా...
అమెరికాలో యాక్టింగ్​ క్లాస్​లతో పాటు, ఫిల్మ్​ మేకింగ్​ టెక్నిక్స్​ కూడా నేర్చుకుంది. డిస్నీస్​ ప్రొడక్షన్​ హౌస్​ నుంచి ఆడిషన్​కి రమ్మని ఫోన్​​ వచ్చింది. ఆడిషన్​ అయిపోయాక, డిస్నీ​ తీస్తున్న ‘స్పిన్’​ అనే ఫిల్మ్​లో మంచి క్యారెక్టర్ వచ్చింది. ఆ సినిమా షూటింగ్​ కిందటేడాది కెనడాలో స్టార్ట్​ చేశారు. ఈ సినిమాలో అవంతిక పాత్ర పేరు రియా. ఎప్పుడూ కలలు కంటూ ఉంటుంది. రియా డీజేగా కనిపిస్తుంది. ఆ అమ్మాయి తన లైఫ్​ని ఎలా బ్యాలెన్స్​ చేసుకుంటుంది? అనే విషయాల్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు లేడీ డైరెక్టర్​ మంజరి మాకిజనీ. ఈ సినిమా ఆగస్టు15, ఇండిపెండెన్స్​ డే రోజు విడుదల కాబోతుంది. తన యాక్టింగ్​ టాలెంట్, టెక్నిక్స్ ​నేర్చుకోవడం, హార్డ్​ వర్క్​ వల్లే ఎంతోమంది యూత్​కి రాని అవకాశం అవంతికకు దక్కింది అంటున్నారు ఆమెని చూసిన వారంతా. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ నెటిజన్​లను ఆకట్టుకుంటోంది.

హీరోయిన్​ అవ్వాలని...
‘‘మంచి రోల్స్ చేయాలని ఉంది. కానీ, తెలుగులో టీనేజ్​ అమ్మాయిలకు యాక్టింగ్​లో పెద్దగా స్కోప్​ లేదనిపించింది. చిన్న చిన్న రోల్స్​ వల్ల గుర్తింపు కూడా దక్కదు. అందుకే నేను తిరిగి అమెరికా వెళ్లిపోయాను. మాలాంటి యంగ్​స్టర్స్​కి చదువు, యాక్టింగ్ రెండింటినీ మేనేజ్​ చేయడం ఛాలెంజింగ్​గానే ఉంటుంది. ఇండియాలో ఉన్నప్పుడు ఇంట్లోనే చదువుకున్నాను. అమెరికా వచ్చాక, స్కూల్​కి వెళ్లేదాన్ని.  నేను షూటింగ్స్​లో ఉన్నప్పుడు మా పేరెంట్స్, టీచర్స్​ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. అలా ఇప్పటికీ కొన్ని తెలుగు సినిమాలతోపాటు హాలీవుడ్​లో టెలివిజన్​ సిరీస్​లలో చేశాను. ‘మిక్కీమౌస్​ మిక్స్​డ్​ అప్​ అడ్వెంచర్స్’​ సిరీస్​కి వాయిస్ ఇచ్చాను. ఫ్యూచర్​లో హీరోయిన్​ అవ్వాలనేది నా కోరిక’’ అంటోంది అవంతిక.

  నటి, డాన్సర్​, సింగర్​, మోడల్, డ్రాయింగ్​ కూడా వేస్తుంది. ఎన్నో యాడ్స్ ​చేసింది.
  కూచిపూడి, కథక్​, జాజ్​, ఇండియన్​ కాంటెంపరరీ డాన్స్​లన్నీ నేర్చుకుంది. 
  2016లో ‘బ్రహ్మోత్సవం’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.
  ‘మనమంతా’  సినిమాలో తెలుగు, మలయాళ భాషల్లో నటించింది. ప్రేమమ్​లో ‘సింధు’ అనే పాత్రలో కనిపించింది. 
  2017లో ‘రారండోయ్​ వేడుక చూద్దాం’లో జూనియర్ రకుల్ ప్రీత్​గా, 2018లో ‘అజ్ఞాతవాసి’లో సంపత్​ కుమార్​ కూతురిగా నటించింది.
  2014లో సిలికాన్​ వ్యాలీ గాట్​ టాలెంట్ అవార్డు గెలిచింది.
  బ్రహ్మోత్సవం సినిమా ప్రమోషన్స్​లో మహేశ్​ బాబును, కాజల్​ అగర్వాల్‌‌‌‌ని ఇంటర్య్యూ చేసింది.  
  ‘స్వేచ్ఛ’, ‘ప్రజా హక్కు’ అనే షార్ట్ ఫిల్మ్స్​లో నటించింది. చిత్రపురి ఫిలిం ఫెస్టివల్​లో ఉత్తమ నటి పురస్కారం అందుకుంది.

Tagged america, Movies, Disney, Avanthika vandanapu, disney spin

Latest Videos

Subscribe Now

More News