మన వ్యాక్సిన్ సర్టిఫికెట్‌‌కు 96 దేశాల్లో గుర్తింపు

మన వ్యాక్సిన్ సర్టిఫికెట్‌‌కు 96 దేశాల్లో గుర్తింపు
  • కేంద్ర మంత్రి మన్​సుఖ్ మాండవీయ

న్యూఢిల్లీ: మన దేశంలో ఇచ్చిన కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్‌‌ను యాక్సెప్ట్‌‌ చేయడానికి 96 దేశాలు అంగీకరించాయని కేంద్ర మంత్రి మన్​సుఖ్ మాండవీయ మంగళవారం చెప్పారు. ప్రపంచంలోని మరిన్ని దేశాలతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందన్నారు. వ్యాక్సిన్ సర్టిఫికెట్లను యాక్సెప్ట్‌‌ చేయడం ద్వారా ఎడ్యుకేషన్, బిజినెస్, టూరిజం కోసం వేరే దేశాలకు వెళ్లే వారు ఈజీగా ట్రావెల్ చేయడానికి చాన్స్ ఉంటుందని కేంద్ర మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు.

‘‘వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల పరస్పర గుర్తింపునకు ప్రస్తుతం 96 దేశాలు అంగీకరించాయి. కొవిషీల్డ్‌‌, డబ్ల్యూహెచ్‌‌వో అప్రూవ్ చేసిన, జాతీయంగా అప్రూవ్ చేసిన పూర్తి స్థాయి వ్యాక్సిన్‌‌ డోసులు తీసుకున్నట్టుగా ఇండియా ఇచ్చిన సర్టిఫికెట్లను ఆయా దేశాలు గుర్తిస్తాయి’’ అని మాండవీయ పేర్కొన్నారు.