
2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధిస్తుందనే విశ్వాసంతో తాను ఉన్నానని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్... వాషింగ్టన్‌లో మీడియాతో ఇంటరాక్షన్ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రాబోయే రెండేళ్ళలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని తాను భావిస్తున్నానని తెలిపారు.
ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించిదని, త్వరలో జరగబోయే మూడు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలను కాంగ్రెస్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కచ్చితంగా ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తాయని రాహుల్ అన్నారు.
ప్రస్తుతం దేశంలోరాజకీయాల్లో ప్రతిపక్షాలు చాలా ఐక్యంగా ఉన్నాయన్న రాహుల్.. తాము అన్ని ప్రతిపక్షాలతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. ప్రధాని మోడీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాపులారిటీ గురించి రాహుల్ మాట్లాడుతూ.. దేశంలోని అన్ని సంస్థలపై ప్రభుత్వం నియంత్రణ ఉందన్నారు. ఆ వార్తలను తాను ఎప్పటికీ నమ్మబోనని తెలిపారు.