ముర్ముకు స్వాగతం పలికిన  రామ్ నాథ్ కోవింద్

ముర్ముకు స్వాగతం పలికిన  రామ్ నాథ్ కోవింద్

న్యూఢిల్లీ : రాష్ట్రపతిగా కాసేపట్లో బాధ్యతలు చేపట్టనున్న ద్రౌపది ముర్ము తొలుత రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు. అక్కడ ఆమెకు ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఆయన సతీమణి సవితా కోవిండ్ పూల బొకేలు ఇచ్చి సాదర స్వాగతం పలికారు. దేశ ప్రథమ పౌరురాలిగా బాధ్యతలు చేపట్టనున్న ముర్ముకు వారు శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం వారు కాసేపు ముచ్చటించారు. 


ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్తో పాటు కొత్తగా ప్రెసిడెంట్ గా ఎన్నికైన  ద్రౌపది ముర్ము దర్బార్ హాలు నుంచి ఫోర్ కోర్డుకు చేరుకున్నారు. అక్కడ ఇరువురు సైనిక గౌరవ వందనం స్వీకరించిన తర్వాత ఒకే కారులో పార్లమెంటు సెంట్రల్ హాలుకు బయలుదేరారు.