నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో అయిదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ప్రభుత్వ ఆసుపత్రి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు శనివారం ఆసుపత్రి ఎదుట మూడో రోజు నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్ జీతాలు ఇవ్వాలని కలెక్టర్ ఇలా త్రిపాఠికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే పెండింగ్‌లో ఉన్న జీతాలను చెల్లించాలని లేని పక్షంలో పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు.
పెరుగుతున్న ధరలకనుగుణంగా జీతాలను పెంచి, ప్రతినెలా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికుల పీఎఫ్ ఎనిమిది నెలలుగా కట్టడం లేదని ఆరోపించారు. ఆసుపత్రి అవుట్ సోర్సింగ్ సిబ్బంది రెండు రోజులుగా ధర్నాలు చేస్తున్నప్పటికీ అధికారుల స్పందించడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో సమ్మె కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో మునగా వెంకన్న, యాదగిరి, అండాలు, సైదులు, లలిత, శ్యామల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
