
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 74 ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఆఫీసర్లు ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా హాజరుకావాలని, ఎమర్జెన్సీ ఉంటే సమాచారం ఇవ్వాలని సూచించారు. డీఆర్డీవో సాయాగౌడ్, నగర పాలక కమిషనర్ దిలీప్ కుమార్, డీపీవో శ్రీనివాస్ రావు, మెప్మా పీడీ రాజేందర్, ఏసీపీ రాజావెంకట్ రెడ్డి, ఏవో ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డిలో 46 ఫిర్యాదులు..
కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డి కలెక్టరేట్లోని ప్రజావాణికి 46 ఫిర్యాదులు రాగా, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ స్వీకరించారు. ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. జిల్లా అదనపు కలెక్టర్ చందర్ నాయక్, కామారెడ్డి ఆర్డీవో వీణ పాల్గొన్నారు.