దేశంలో ఒక్కరోజే 200లకు పైగా పాజిటివ్ కేసులు

దేశంలో ఒక్కరోజే 200లకు పైగా పాజిటివ్ కేసులు

ఒక్కరోజే 203 కేసులు
1,619కు పెరిగిన కరోనా బాధితులు
కరోనా లిస్ట్లో అస్సాం.. ఫస్ట్ కేసు నమోదు
49కు పెరిగిన మరణాలు.. ఒక్క రోజు ఏడుగురు మృతి

న్యూఢిల్లీ: దేశంలో కేసుల సంఖ్య 1600 దాటింది. ఒక్కరోజే 203 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం 49 మంది చనిపోయారు. మంగళవారం ఏడుగురు చనిపోయారు. కేరళ, మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్, పంజాబ్, బెంగాల్లో, తెలంగాణలో ఇద్దరు చొప్పున చనిపోయారు. కరోనా జాబితాలోకి ఇంకో రాష్ట్రం చేరింది. అస్సాంలో ఫస్ట్ కేసు నమోదైంది.

సిగరెట్, మందు తాగొద్దు
లాక్డౌన్ కారణంగా ఒత్తిడి పెరిగిపోతుందన్న సాకుచూపి మందు కొట్టడం, సిగరెట్ కాల్చడం వంటివి చేస్తే రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. దీని ప్రభావం మెంటల్ హెల్త్ పైన కూడా పడుతుందని, కాబట్టి వాటికి దూరంగా ఉండాలని సూచించింది. దేశంలో కరోనా మరణాలు, పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నందు వల్ల వైరస్ సోకిన వారికి దూరంగా ఉండాలని చెప్పింది. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిచెందకుండా ఉండేందుకే లాక్డౌన్ను ప్రకటించారని, మనల్ని మనం కాపాడుకోవడమే దీని ఉద్దేశమని స్పష్టం చేసింది. నిత్యావసరాల కోసం తప్ప అస్సలు బయటకు రావొద్దని , ఇంటి నుంచి ఒక్కరే .. అది కూడా చాలా తక్కువ సార్లు మాత్రమే రావాలని పేర్కొంది. కాగా, కొవిడ్ 19 టెస్టింగ్, శాంపిలింగ్స్ పై కేంద్ర ఆరోగ్య మంత్రి హరవర్షన్ మంగళవారం రివ్యూ చేశారు. లేబొరేటరీలకు టెస్టింగ్ కిట్లను సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. హాస్పిటల్స్, ల్యాబ్స్లో అన్ని సదుపాయాలు ఉండేలా చూడాలని, టెస్టింగ్ కిట్లు, ఇతర ఎక్విప్మెంట్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

21 వేల రిలీఫ్ క్యాంపులు
దేశవ్యాప్తంగా 21 వేల కొవిడ్ 19 రిలీఫ్ క్యాంపులు 24/7 పనిచేస్తున్నాయని, వీటిలో 6.6 లక్షల మంది జనం తలదాచుకుంటున్నారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఈ క్యాంపుల్లో రోజూ 23 లక్షల మందికి ఆహారం, మంచి నీళ్లుసరఫరా చేస్తున్నామని కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీవాస్తవ చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రా లు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాక్డౌన్ సిట్యువేషన్ను నిరంతరం మానిటర్ చేస్తున్నామని, ప్రస్తుతం పరిస్థితి సంతృప్తికరంగానే ఉందని వివరించారు. అత్యవసర, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఇబ్బందులు లేవని, అంతర్ రాష్ట్ర కార్గో సర్వీసులు కూడా ఎలాంటి ఆటంకాలు లేవని శ్రీవాస్తవ చెప్పారు. లాక్డౌన్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని తాము నమ్ముతున్నామని చెప్పారు.

ఇంటికే మందు.. స్పెషల్ పాసులు
లిక్కర్ కు అలవాటు పడి కొద్ది రోజులుగా మందు దొరక్క హెల్త్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి మేఘాలయ సర్కారు సూపర్ వార్త చెప్పింది. అలాంటి వాళ్లకు ఇంటికే మందును డెలివరీ చేస్తామని చెప్పింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇంటికి పంపుతామని స్పష్టం చేసింది. ఏప్రిల్ 14 వరకూ లిక్కర్ అమ్మకం, హోం డెలివరి చేసేందుకు బాండెడ్ వేర్ హౌస్లకు అనుమతి ఇచ్చింది. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వారికి మాత్రమే హోం డెలివరి చేస్తారు. కేరళ సర్కార్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్నవాళ్లకు స్పెషల్ లిక్కర్ పాసు లిస్తోంది. ‘లిక్కర్ దొరక్కపోవడంతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, పిచ్చిపిచ్చి గా ప్రవర్తిస్తున్నారని మా దృష్టికి వచ్చింది. అందుకే ఈ నిరయం” అని కేరళ సర్కార్ పేర్కొంది. ఎక్సైజ్ ఆఫీసులకు వెళ్లి ప్రిస్క్రిప్షన్, ఏదైనా ప్రభుత్వ ఐడీ కార్డు చూపిస్తే అప్పుడు వారికి లిక్కర్ పాస్ జారీ చేస్తారని వివరించారు. పెద్ద ఏరియాల్లో శానిటైజ్ చేసే డ్రోన్లను ఐఐటీ గౌహతి స్టూడెంట్లు డెవలప్ చేశారు. దీంతో 15 నిమిషాల్లో పెద్ద ప్రాంతాన్ని శానిటైజ్ చేయొచ్చని వాళ్లు చెబుతున్నారు. ఢిల్లీలో 20 వేలకు పైగా ఇండ్లకు హోంక్వారంటైన్ మార్కు వేసినట్టు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ వెల్లడించారు.

For More News..

చైనాను దాటిన అమెరికా

ఫోన్ చేస్తే ఫ్రీగా ఫుడ్

ఇయ్యాల్టి నుంచే రేషన్ పంపిణీ