టీజీ ఈఏపీ సెట్‌‌ కు 2.2 లక్షల దరఖాస్తులు

టీజీ ఈఏపీ సెట్‌‌ కు 2.2 లక్షల దరఖాస్తులు
  • ఏప్రిల్​ 4 వరకు అప్లికేషన్​కు చాన్స్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నిర్వహించనున్న టీజీ ఈఏపీసెట్–2026కు భారీ స్పందన లభిస్తోంది. సోమవారం సాయంత్రం వరకు మొత్తం 2,20,879 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు కన్వీనర్ డాక్టర్ కె.విజయకుమార్ రెడ్డి తెలిపారు. ఇంజినీరింగ్ విభాగానికి 1,55,804 మంది, అగ్రికల్చర్ అండ్​ ఫార్మసీ స్ట్రీమ్‌‌కు 64,866 మంది అప్లై చేశారు. రెండు విభాగాలకు కలిపి 209 మంది దరఖాస్తు చేసుకున్నారు.

గత నెల 19న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 4 వరకు జరిమానా లేకుండా కొనసాగనుంది. దరఖాస్తుల సంఖ్య పెరుగుతుండటంతో పరీక్షా కేంద్రాలు వేగంగా నిండుతున్నాయి. రాష్ట్రంలోని 16 టెస్ట్ జోన్లలో 10 జోన్ల సెంటర్లు ఇప్పటికే ఫుల్ అయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్(జోన్​ 1, 2, 3), ఖమ్మం, సత్తుపల్లి, వరంగల్ కేంద్రాల్లోనే స్లాట్లు అందుబాటులో ఉన్నాయని కన్వీనర్​ తెలిపారు.