
పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారీగా మంచు వర్షం కురిసింది. ఆ ప్రాంతమంతా మంచు కప్పుకుపోవడంతో.. 30 మంది చనిపోయారు. గడచిన 24 గంటల్లో భారీగా కురిసిన మంచు వర్షంతో క్వెట్టా ప్రాంతంలో ఓ భవనం కూలి పోయి 17 మంది అక్కడికక్కడే మరణించగా, మరో 13 మంది గాయపడ్డారు. మృతుల్లో పిల్లలు, మహిళలున్నారు. బెలూచిస్థాన్ లో మంచు తుపాన్ కారణంగా మరో 14 మంది మరణించారు. భారీగా కురిసిన మంచు ప్రభావంతో క్వెట్టా-జియారత్ జాతీయ రహదారిని మూసివేశారు. కశ్మీర్,గిల్జిత్, బల్టిస్థాన్, మలాకంద్, హాజారా జిల్లాల్లో భారీమంచు వర్షం కురిసింది. మంచు వర్షం కురుస్తున్నందున…అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు.